సీఎం రేవంత్‌ సమక్షంలో వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు | Huge Number Of Maoist Surrender in Presence of CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ సమక్షంలో వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు

Mar 7 2026 4:24 PM | Updated on Mar 7 2026 5:10 PM

Huge Number Of Maoist Surrender in Presence of CM Revanth Reddy

హైదరాబాద్‌:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 126 మంది మావోయిస్టులు.. ఆయుధాలు విడిచి సరెండర్‌ అయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు.  లొంగిపోయిన వారిలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి సైతం ఉన్నారు. 

దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ దళం మొత్తం సరెండర్‌ అయ్యింది. లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టు నేత సంతోష్‌ ఉన్నారు. 31 ఏకే-47లతో పాటు భారీగా ఆయుధాలను అప్పగించారు సంతోష్‌. ఇక లొంగిపోయిన వారిలో ఏవోబీ కీలకనేత చలసాని నవత సైతం ఉన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మావోయిస్టుల ఆయుధాలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించిన తర్వాత వారితో ముచ్చటించారు. 

కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా వందకు పైగా మావోయిస్టులు లొంగిపోవడం  ఆ  ఉద్యమం చివరి దశకు చేరిందనేదానికి నిదర్శనం. 

Advertisement
 
Advertisement
Advertisement