
విస్ వరల్డ్ ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టే వస్త్రధారణలో హైలెట్‌గా కనిపించింది నందిని గుప్తా.

కిషాందాస్ జ్యువెలర్స్ ఆభరణాలతో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్‌లో పాల్గొంది

భారతదేశ గొప్ప వస్త్ర వారసత్వానికి, రాయల్ లుక్‌కి ప్రతీకగా ఉంది నందిని ఆహార్యం

బర్మీస్ కెంపులు, ముత్యాలతో కూడిన రెండు అంచెల నెమలి నెక్లెస్, కడాస్, ఉంగరాలు, నడుమకి వడ్డాణంతో రాకుమారిలా కనిపించింది బంగారు జరీతో చేసిన ఖాదీ లెహంగాలో అబ్బురుపరిచింది.

ఈ అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా తొలిరోజే సంప్రదాయ ఆభరణాలు, వస్త్రధారణతో ప్రత్యేకంగా నిలిచింది.

ఇతర పోటీదారులతో కలిసి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ర్యాంప్ వాక్‌లో పాల్గొంది

తెలంగాణ సాంస్కృతికి వారసత్వాన్ని ప్రతిబింబించే నృత్యాలు..మరోవైపు ఇతర దేశాల సుందరీమణులు కూడా తమ దేశ సంప్రదాయ దుస్తుల్లో ర్యాంపు వ్యాక్ చేశారు.
