
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి నిర్వహించిన ‘టాలెంట్ గ్రాండ్ ఫినాలే విభిన్న కళలతో అలరించింది.

నృత్యంలో అలరించిన మిస్ ఇండియా నందినీ గుప్తా

24 దేశాలకు చెందిన పోటీదారులు ఎంపికైన ఈ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండవ స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు.

అద్భుతమైన పియానో సంగీతంతో మిస్ ఇండోనేషియా వేదికను సోల్‌ఫుల్ ఫీల్‌లో ముంచెత్తింది.

శ్రావ్యమైన పాశ్చాత్య సంగీత వెల్లువతో ‘గుడ్‌నెస్ ఆఫ్ గాడ్’ పాట పాడి మిస్ కామెరూన్ ప్యానెలిస్టుల మనసు దోచుకుంది



















