మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే ఆద్యంతం వైభవంగా జరిగింది.
దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ అందాల పోటీలు నిన్నటితో(మే 31)తో ముగిశాయి.
శనివారం జరిగిన మిస్ వరల్డ్ ఫినాలే ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.
చిరంజీవి, రానా, నమ్రత, జాక్వెలిన్, మనుషీ చిల్లర్, సోనూసూద్ సందడి చేశారు. కోవిడ్ సమయంలో చేసిన సేవలకుగాను సోనూసూద్‌కు ‘మిస్ట్ వరల్డ్ మానవతావాది’ పురస్కారాన్ని అందించారు.
ఇక మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయిలాండ్ బ్యూటీ చువాంగ్ శ్రీ దక్కించుకుంది.


