
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 109 దేశాల ప్రపంచ సుందరీమణులు ఈరోజు(శనివారం, మే 17వ తేదీ) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వీరిని పలు విభాగాలుగా విభజించి మొత్తం పది స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించారు.



















