16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు.. | Miss World Thailand 2025 Opal Suchata faced life changing diagnosis | Sakshi
Sakshi News home page

16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..

May 6 2025 11:02 AM | Updated on May 7 2025 6:00 PM

Miss World Thailand 2025 Opal Suchata faced life changing diagnosis

హైదరాబాద్‌ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్‌ వరల్డ్‌ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్‌ వరల్డ్‌ థాయిలాండ్‌ 2025 ‘ఓపాల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సింఘానియాస్‌ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్‌ ఫర్‌ హర్‌’కు మద్దతుగా సింఘానియాస్‌ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్‌ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!!       

గ్లోబల్‌ వేదికగా ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీల్లో థాయిలాండ్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్‌ థాయ్‌లాండ్‌గా మిస్‌ వరల్డ్‌ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. 

నా జీవితంలో ఇదొక మిరాకిల్‌. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్‌ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌. పుట్టి పెరిగిందంతా థాయ్‌లాండ్‌ ఫుకెట్లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్‌ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్‌ ప్రయాణం మొదలైంది. 

ఆ బాధ నాకు తెలుసు.. 
సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్‌ క్యాన్సరస్‌ లంప్‌ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. 

అందుకే.. రొమ్ము క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్‌ థాయ్‌లాండ్‌గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్‌ ఫర్‌ హర్‌’లో పాలుపంచుకున్నా. థాయ్‌ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి.  

ఆతిథ్యం అదుర్స్‌.. 
ఎయిర్‌ పోర్ట్‌లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్‌ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్‌ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్‌ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్‌కు కూడా వెళతాను.   

(చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!)

Advertisement
 
Advertisement
Advertisement