కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి ‍శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు | Kerala Shruthi finds happiness after Wayanad landslide lost 9 family members | Sakshi
Sakshi News home page

కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి ‍శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు

Nov 10 2026 3:18 PM | Updated on Nov 10 2026 3:28 PM

Kerala  Shruthi finds happiness after Wayanad landslide lost 9 family members

ఏ చిన్న కష్టం వచ్చినా.. ‘దేవుడా నాకే  ఎందుకు ఇన్ని కష్టాలు’ అని మనలో చాలామంది కృంగిపోతూ ఉంటాం. కానీ కష్టాలు కలకాలం ఉండవు. చీకటి వెలుగుల జీవితంలో ఒడిదుకులు తప్పవు అని నిరూపించిన కథ కేరళకు చెందిన 26 ఏళ్ల ఎస్. శ్రుతిది. 2024 జూలై 30న వాయినాడ్‌లోని ముండక్కై ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘోర దుర్ఘటనలో శ్రుతి తన తల్లిదండ్రులు, సోదరితో సహా కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులను కోల్పోయింది. ఆమె ఎంతో ఆశగా నిర్మించుకున్న ఇల్లు, పెళ్లి కోసం దాచుకున్న నగలు, డబ్బు అన్నీ ఆ మట్టిలోనే కలిసిపోయాయి. అయినా ఆమె గుండె దిటవు చేసుకుంది.  తాజాగా శ్రుతి (26) జీవితంలో మళ్లీ వెలుగులు నిండాయి.ఎలా అంటే..

సర్వస్వం కోల్పోయిన ఆమెకు బాల్య స్నేహితుడు, కాబోయే భర్త  జెన్సన్  తోడు నీడగా నిలిచాడు. వీరిద్దరూ దాదాపు 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. డిసెంబరు ఇద్దరూ కలిసి  కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్న తరుణంలో మరోసారి విధి ఆమెపై మరోసారి పంజా విసిరింది. ఈ విషాదం జరిగిన కొన్ని నెలలకే (సెప్టెంబర్ 2024)  జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో జెన్సన్ కూడా కోల్పోయింది.  ఆ ప్రమాదంలో శ్రుతి కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ని ఎదురుదెబ్బల మధ్య శ్రుతి జీవితంపై నమ్మకం కోల్పోలేదు.  ఆశగా జీవన  పోరాటం చేసింది. ఆమె పోరాటం వృధా కాలేదు.


కొత్త జీవితం వైపు అడుగులు
కుటుంబాన్ని, కాబోయే భర్తని అనూహ్యంగా కోల్పోయిన శృతికి  కేరళ ప్రభుత్వం వయనాడ్ కలెక్టరేట్‌లోని రెవెన్యూ శాఖలో క్లర్క్‌గా ఉద్యోగం ఇచ్చింది.  2024 డిసెంబర్‌లో  విధుల్లో చేరిన శ్రుతి, ధైర్యంతో తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ప్రారంభించారు. తాజాగా  ఆమె అదే కలెక్టరేట్‌లో పనిచేస్తున్న సందీప్‌ను గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలోపెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీంతో వరుస ఘోర విషాదాలను తట్టుకుని నిలబడిన శ్రుతి , నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని నెటిజన్లు ఆశీర్వదించారు.

రాష్ట్ర మాజీ రెవెన్యూ మంత్రి కె. రాజన్  తండ్రి స్థానంలో ఉండి వీరి వివాహ తంతును జరిపించారు. ఈ వివాహ వేడుకకు సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. వివాహం తర్వాత విలేకరులతో మాట్లాడిన శ్రుతి, తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement