పెళ్లికి ఇరుముడి హీరోయిన్ రెడీ.. వరుడు ఎవరంటే? | Irumudi Actress Priya Bhavani Shankar ready To Marry with Her Lover | Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar: ఇరుముడి హీరోయిన్‌ పెళ్లి కళ.. ప్రియుడితో ఏడడుగులు!

Nov 10 2026 1:33 PM | Updated on Nov 10 2026 1:40 PM

Irumudi Actress Priya Bhavani Shankar ready To Marry with Her Lover

ఈ ఏడాది రవితేజ హీరోగా వచ్చిన మూవీ ఇరుముడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా మెప్పించింది.

తాజాగా హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌కు సంబంధించి కోలీవుడ్‌లో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. తన ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని సమాచారం. తాజాగా ప్రియా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. వీటిలో సంప్రదాయ దుస్తులతో పాటు మెడలో మల్లెపూల దండలతో కనిపించింది. తన చేతులకు గోరింటాకు పెట్టుకున్న ఈ పిక్స్  ఆమె అభిమానులతో పంచుకుంది.

‍అయితే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. కాలేజీ రోజుల నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ జంట దాదాపు పదేళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్నారని కోలీవుడ్ టాక్. అంతేకాకుండా 2022లోనే ఓ గృహాన్ని కూడా కొనుగోలు చేశారట. అయితే ఈ పెళ్లి విషయంలో ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. ప్రియా భవానీ పెళ్లికి సంబంధించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement