పవన్ కల్యాణ్‌తో విడాకులు.. అన్నా లెజినోవా కీలక నిర్ణయం | Anna Konidala deactivates Instagram after announcing separation | Sakshi
Sakshi News home page

Anna Konidala: పవన్ కల్యాణ్‌తో విడాకులు.. అన్నా లెజినోవా కీలక నిర్ణయం

Nov 10 2026 10:56 AM | Updated on Nov 10 2026 11:01 AM

Anna Konidala deactivates Instagram after announcing separation

పవన్ కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. విడాకుల ప్రకటన అనంతరం ఆమె తన సోషల్ మీడియా ఖాతాను తొలగించింది. డివోర్స్‌పై ఇద్దరు సంయుక్త ప్రకటన చేసిన త‍ర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. వెంటనే ఆమె తన ఇన్‌స్టా ఖాతాను తీసేసింది. గత కొన్ని నెలలుగా అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు. 2013లో వీరి వివాహం తర్వాత కుటుంబంతో కలిసి పలు సందర్భాల్లో ఆమె పోస్టులు పెట్టారు. విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా అకౌంట్‌ డీయాక్టివేట్ చేసింది.

అయితే తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకుల నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. తాము స్నేహితులుగా కొనసాగుతామని.. తమ పిల్లలకు అంకితభావం గల తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు.  వారి సంతోషం, శ్రేయస్సు ఎల్లప్పుడూ మా ఇద్దరి ప్రాధాన్యతగా ఉంటుందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో తమ గోప్యతను గౌరవించాలని కూడా కోరారు.

కాగా.. అన్నా కొణిదెలను పవన్ కల్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు. అంతకుముందు పవన్ 1997 సెప్టెంబర్‌లో నందినిని మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఈ జంట 1999లో విడిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. 2008లో మాత్రమే అఫీషయల్‌గా విడిపోయారు. ఆ తర్వాత  2009లో నటి రేణు దేశాయ్‌ను పవన్ వివాహం చేసుకున్నారు. 2000లో వచ్చిన 'బద్రి' అనే తెలుగు సినిమాలో కలిసి నటించారు. వీరికి అకిరా నందన్ అనే కుమారుడు, ఆధ్య అనే కుమార్తె అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరి బంధం 2012లో ముగిసింది. 2013 సెప్టెంబర్‌లో రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు తీన్‌మార్‌ మూవీలో కలిసి నటించారు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె పోలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు.

a
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement