అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కమింగ్ సూన్ అంటూ క్రేజీ కల్యాణం పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు.
కథేంటంటే..
మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాలరాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. నిత్యం తాగుతూ..ఊర్లో వాళ్ళతో గొడవలు చేసి మామ పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు.
కానీ కీర్తి కాలేజీ లో ఉదయ్(అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. బాగా చదువుకొని జాబ్ వచ్చిన తరువాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ లోపు నాన్న పర్వతాలు ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. నాన్న కోరిక మేరకు కీర్తి ఆ అమెరికా సంబంధం ఓకే చేసిందా? లేదా ప్రేమించిన ఉదయ్‌ని పెళ్లి చేసుకుందా? బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలకున్న తన లక్ష్యం నెరవేరిందా? లేదా? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Consider this your invitation to madness! #CrazyKalyanam coming soon on aha! @anupamahere #tharunbhascker @Akhilrajuddemar @IamChaitanyarao #CrazyKalyanamOnaha https://t.co/fE2M9yvBEX
— ahavideoin (@ahavideoIN) November 8, 2026


