రామాయణ మూవీ.. ఆ ఫార్మాట్‌లో కాసుల వర్షం | Ramayana Movie Record Collections in 3D Format | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణ మూవీ.. ఆ ఫార్మాట్‌లో రికార్డ్‌ వసూళ్లు..!

Nov 9 2026 4:35 AM | Updated on Nov 9 2026 4:35 AM

Ramayana Movie Record Collections in 3D Format

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన సినిమా రామాయణ. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా మెప్పించారు. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లో భారత్‌లో రూ.175.94 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. 3డీ ఫార్మాట్‌లోనే ఏకంగా రూ.115.46 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లలో 65.62 శాతం వాటా 3డీ ఫార్మాట్ నుంచే వచ్చింది.

ఫార్మాట్‌ల వారీగా చూస్తే స్టాండర్డ్ 3డీ ప్రదర్శనలు రూ.98.55 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచాయి. స్టాండర్డ్ 2డీ ద్వారా రూ.59.96 కోట్లు, ఐమాక్స్ 3D ద్వారా రూ.12.54 కోట్లు వచ్చాయి. ఇక 4డీఎక్స్‌ 3డీ రూపంలో రూ.2.82 కోట్లు, ఇతర ప్రీమియం ఫార్మాట్ల ద్వారా మరో రూ.2.08 కోట్లు సమకూరాయి. టికెట్ల విక్రయాల పరంగా కూడా 3డీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. రామాయణ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement