'లిటిల్ హార్ట్స్' మౌళి హీరోగా చేసిన రెండో సినిమా 'దొంగ నా కొడుకు'. సెన్సార్ సమస్యల వల్ల టైటిల్‌ని 'డీఎన్‌కే' అని మార్చారు. ఈ శుక్రవారమే(నవంబర్ 13) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో రవితేజ.. దీని ట్రైలర్ వదిలారు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఈ ట్రైలర్.. మూవీపై ఆసక్తి పెంచుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
'మోస్ట్ చిల్లర్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్' అని ప్రమోట్ చేసుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ బట్టి చూస్తే.. ఆవారాగా తిరిగే మౌళి, క్రికెట్ బెట్టింగులు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు. దీంతో చాలా డబ్బు అవసరమై ఓ బంగారం షాపులో దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైంది? దోచుకున్న నగలు ఏమయ్యాయి? చివరకు ఏమైందనేదే స్టోరీలా ఉంది.
రోజువారీ సోషల్ మీడియాలో వినిపించే ఫన్నీ డైలాగ్స్.. ట్రైలర్‌లో వినిపించాయి. డబుల్ మీనింగ్ కామెడీ కూడా ఉందనిపిస్తోంది. మరి మౌళి రెండో మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. శ్రీను దీనికి దర్శకుడు కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
(ఇదీ చదవండి: వచ్చే నెలలో సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం)


