తీర్పు వెలువరించిన యూకే కోర్టు
లండన్: ఓ మహిళపై అ త్యాచారం, మరో ముగ్గురిపై లైంగికపరమైన దాడి కేసుల్లో హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్(51)కు యూకే కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ‘ఇరవయ్యేళ్ల క్రితం అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న రస్సెల్ బ్రాండ్ చాలా తెలివైన, చురుకైన వ్యక్తి. ఆ సమయంలోనే లైంగిక నేరాలకు తెగబడ్డాడు.
మహిళలంటే ఇతడికి ఏమాత్రం గౌరవభావం లేదు’అంటూ సోమవారం తీర్పు సమయంలో 8 మంది పురుషులు, నలుగురు మహిళా జడ్జీలతో కూడిన సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. బ్రాండ్‌పై దాఖలైన ఆరు కేసులకు గాను నాలుగింటిలో దోషిగా బెంచ్ నిర్థారించింది. ఈ కేసుల్లో 2004 నాటివీ ఉన్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో బ్రాండ్ భార్య లారా, తండ్రి రాన్ బ్రాండ్ కోర్టులోనే ఉన్నారు.


