నాష్‌విల్లె(టెన్నెస్సీ): విషపు ఇంజెక్షన్‌తో అమలు చేసిన మరణ శిక్ష విఫలమై, ఆస్పత్రిలో చేరిన క్రిస్టా పైక్(50)కోలుకుని తిరిగి జైలుకు చేరుకుంది. గత 30 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నాష్‌విల్లెలోని డెబ్రా కె.జాన్సన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు ఆమెను అధికారులు తరలించారని లాయర్ తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనూ తక్షణమే స్పందించి, తనకు ఆస్పత్రిలో వైద్యం చేయించిన అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు.
క్లాస్‌మేట్‌ను పాశవికంగా చంపిన 1995 నాటి కేసులో క్రిస్టా పైక్‌కు కోర్టు మరణ శిక్ష విధించింది. శిక్షను అమలు చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన రెండు దఫాలుగా విషం ఇంజెక్షన్‌ను ఇచి్చన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ప్రాణాలతో ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒక దశలో ఆమెను వెంటిలేటర్‌పైనా ఉంచారు. అయినప్పటికీ క్రమంగా కోలుకుంది. విషం ఇంజెక్షన్ ఇచ్చినా ప్రాణాలతో బయటపడిన మొదటి వ్యక్తి క్రిస్టా పైక్ అని అమెరికాలోని డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ పేర్కొనడం గమనార్హం.


