హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే ఉరిశిక్ష తప్పదు | Sheikh Hasina has to face death sentence says Bangladesh prosecutor | Sakshi
Sakshi News home page

హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే ఉరిశిక్ష తప్పదు

Nov 10 2026 4:59 PM | Updated on Nov 10 2026 5:03 PM

Sheikh Hasina has to face death sentence says Bangladesh prosecutor

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం కీలక హెచ్చరిక చేశారు. హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే ఆమె మరణశిక్ష తీర్పును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. హసీనాకు ఇక మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రజా ఉద్యమం నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన హసీనా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.

డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు గతంలోనే హసీనా ప్రకటించారు. అంతేకాదు అవసరమైతే కోర్టులో లొంగిపోయేందుకు కూడా సిద్ధమని రాయిటర్స్‌కు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని లండన్‌కు చెందిన తన న్యాయవాదుల ద్వారా ఆమె లేఖ పంపించారు.

అయితే ఈ అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. మరణశిక్ష పడిన వ్యక్తికి ప్రయాణ పత్రాలు జారీ చేయడానికి చట్టపరమైన అవకాశం లేదని ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు. నిజంగా స్వదేశానికి రావాలనుకుంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించి, భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం తనను అప్పగించాలని కోరాలని సూచించారు.

ఇక మరోవైపు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ కూడా హసీనా తిరిగి రావడానికి అప్పగింత ఒప్పందమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కాగా ఈ వ్యవహారంతో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఇప్పటికే ఉన్న దౌత్య సంబంధాల ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో కీలక పదవులపై ప్రతిపక్షాల ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement