ఇజ్రాయెల్‌లో కీలక పదవులపై ప్రతిపక్షాల ఒప్పందం | Opposition parties reach agreement on key positions in Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో కీలక పదవులపై ప్రతిపక్షాల ఒప్పందం

Nov 10 2026 4:08 PM | Updated on Nov 10 2026 4:18 PM

Opposition parties reach agreement on key positions in Israel

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే రాజకీయ కసరత్తు ముమ్మరమైంది. ఈ క్రమంలో గాడి ఐసెన్‌కోట్ ప్రతిపక్ష నేతలతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. నఫ్తాలి బెన్నెట్, యైర్ గోలన్, అవిగ్డోర్ లీబర్‌మన్, యైర్ లాపిడ్‌లతో చర్చించి 26వ నెస్సెట్‌లో కీలక పదవులకు అభ్యర్థులను ఖరారు చేశారు. నెస్సెట్ స్పీకర్ పదవికి మాజీ మంత్రి మతన్ కహానాను ఆయన ప్రతిపాదించారు.

హౌస్ కమిటీ ఛైర్మన్‌గా రాయ్ ఫోల్క్‌మన్, విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ ఛైర్మన్‌గా అవిగ్డోర్ లీబర్‌మన్, ఆర్థిక కమిటీ ఛైర్‌పర్సన్‌గా లిరాన్ అవిసార్ బెన్-హోరిన్ పేర్లను ఖరారు చేసినట్లు ఐసెన్‌కోట్ వెల్లడించారు. ఈ వారంలో కమిటీల కూర్పును కూడా పూర్తి చేసి వచ్చే బుధవారం నెస్సెట్ ఆమోదానికి సమర్పించనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు 28 రోజుల గడువు
నవంబర్ 8న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు అవకాశం ఇచ్చారు. 67 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలపగా, 46 మంది ఎంపీలు ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతు ప్రకటించారు. మిగిలిన ఏడుగురు ఎంపీలు ఎవరికీ మద్దతు ఇవ్వలేదు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు 28 రోజుల గడువు ఉంది. ఒకవేళ అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజులు పొడిగించవచ్చు. అయితే 120 మంది సభ్యులున్న నెస్సెట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఐసెన్‌కోట్ కూటమికి 48 స్థానాలు ఉండగా, నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు ఉన్నాయి. దీంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. దేశంలో జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని ఐసెన్‌కోట్ ప్రకటించారు. ఇందుకోసం సంప్రదాయానికి భిన్నమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాజీవ్‌ను వేడుకున్నా.. కానీ రాహుల్‌ను అడ్డుకోలేదు: సోనియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement