key positions
-
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ధనబలం ఉన్న నేతలు, లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేశ్‌కి అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.గతంలో పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బొండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్‌బ్యూరోలో ఆయన్ని కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్పిచెప్పారు. ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్‌బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావడం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. జిల్లాల్లో మారిన టీడీపీ నాయకత్వంపలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎప్పుడూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరందరినీ పక్కనపెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్‌బ్యూరోకి తీసుకున్నారు. సోమిరెడ్డిని పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద, నారాయణలకైతే ఏ కమిటీలోను స్థానమే లేకుండాపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు.పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లయిన గంటా శ్రీనివాసరావు వంటి నేతలను పక్కనపెట్టారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని పక్కనపెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలం ఎక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ల స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గళ్లా మాధవి, అనగాని సత్యప్రసాద్కి పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్ధన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత పెంచారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకులను నియమించి 2024 ఎన్నికల విన్నింగ్ టీమ్‌గా వారితో పనిచేయించారు. వారిలో 150 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తమకు అనుంగు అనుచరులుగా ఉన్న కిలారు రాజేష్, సానా సతీష్ వంటి పార్టీకి సంబంధం లేనివారిని అందలం ఎక్కించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి. -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??
రాంచీ: బీహార్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి.. తిరిగి పాత మిత్రులతో జత కట్టిన నితీశ్ కుమార్.. ఇప్పటికే కేబినెట్ కూర్పును ఓ కొలిక్కి తెచ్చారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే.. ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితులే కనిపించబోతున్నాయా? అనే చర్చ జోరందుకుంది. బీహార్ సీఎం నితీశ్ ఇవాళ కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. మొత్తం బీహార్ కేబినెట్లో 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ జేడీయూకు 16, నితీశ్ కుమార్ జేడీయూకు 12 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. కానీ, కీలకమైన విభాగాలు మాత్రం ఆర్జేడీ, ఇతరులకు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోనూ బీజేపీ కీలకమైన శాఖలన్నీ ఉంచేసుకుని.. షిండే వర్గానికి మిగిలిన పోస్టులను మిగిల్చింది. గతంలో ఈ శాఖలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అనుభవించాయి. ఇప్పుడు.. బీహార్‌లోనూ మిత్రపక్షాల కోసం జేడీయూ అదే తరహా త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి యాదవ్.. హోం లేదంటే ఆర్థిక శాఖను చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇంతకు ముందు హోం శాఖను నితీశ్ కుమారే స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అంతేకాదు తన పేషీలోని కీలకమైన, సీనియర్ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ తేజస్వి యాదవ్.. ముఖ్యమైన పోస్టులు అప్పజెప్పబోతున్నారనే ప్రచారం అక్కడి స్థానిక మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు బీజేపీకి జేడీయూ కేటాయించిన ఆరోగ్యం, ఆర్థికం, రోడ్లు భవనాల శాఖల మీదే ఆర్జేడీ ఫోకస్ చేసిందని.. వాటి కోసమే పట్టుబడుతోందన్నది ఆ కథనాల సారాంశం. ఇదిలా ఉంటే.. మహాకూటమి నేతృత్వంలోని నితీశ్ సర్కార్ వచ్చే వారం.. అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా గాంధీ -
'మహిళలు కీలక పదవులు దక్కించుకోవాలి'
విజయవాడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. వనితలు తాము పనిచేసే చోట కీలక స్థానాలు దక్కించుకోవాలని, తద్వారా సమాజంలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. మహిళల భద్రతపై ఏబీవీపీ ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్ ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవహారాలు, పబ్లిక్ సెక్టార్ లో మహిళలు మరింతగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. చట్టం ఒక్కటే మహిళకు రక్షణ కల్పించలేదని అభిప్రాయపడ్డారు. స్త్రీలపై హింసను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.


