ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలో ఆరుగురు విదేశీయులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం కూలిపోయినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి తెలిపారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, విమానంలో ఉన్న ప్రయాణికులు లేదా సిబ్బంది ఎవరైనా మరణించారో లేదో ఇంకా తెలియరాలేదని దావావో డెల్ సుర్‌లోని డిగోస్ నగరానికి చెందిన అధికారి జోమార్ కాలెడో చెప్పారు. విమానంలో ఉన్నవారి పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలు లాంటి విషయాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


