బంగ్లాదేశ్‌కు భారీ షాక్ | Shadman Islam ruled out of South Africa tour due to ankle injury | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు భారీ షాక్

Nov 8 2026 11:14 AM | Updated on Nov 8 2026 11:14 AM

Shadman Islam ruled out of South Africa tour due to ankle injury

source: X

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గాయపడిన అతడు రాబోయే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని బంగ్లాదేశ్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది.

సిల్హెట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు షాద్‌మన్ ఇస్లాం చీలమండకు గాయమైంది. అతడి చీలమండ మెలిక పడటంతో ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో షాద్‌మన్‌ విండీస్‌తో రెండో టెస్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు.

మహ్‌ఫిజుల్ ఇస్లాం రాబిన్‌కు అవకాశం..?
దక్షిణాఫ్రికా పర్యటనకు షాద్‌మన్ ఇస్లాం స్థానంలో యువ ఓపెనర్ మహ్‌ఫిజుల్ ఇస్లాం రాబిన్‌కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రాబిన్.. సిల్హెట్‌లోనే జాతీయ జట్టుతో ఉన్నాడు. నెట్స్‌లో జాతీయ కోచ్‌ల పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతడిని టెస్టు జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని క్రిక్‌బజ్ పేర్కొంది.

నవంబర్ 15 నుంచి తొలి టెస్టు
బంగ్లాదేశ్ జట్టు నవంబర్ 10న ఢాకా నుంచి దక్షిణాఫ్రికాకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.

- తొలి టెస్టు: నవంబర్ 15 నుంచి 19 వరకు, వాండరర్స్ స్టేడియం.
- రెండో టెస్టు: నవంబర్ 23 నుంచి 27 వరకు, సూపర్‌స్పోర్ట్ పార్క్.

ఇదీ చదవండి: సత్తా చాటిన తిలక్‌.. టీమిండియా భారీ స్కోర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement