కాంబోజ్‌ పదునైన బౌన్సర్‌.. కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌ | Kamboj-Bouncer-Suffers-Tickner Concussion-Matt Fisher-Replaced-2nd ODI | Sakshi
Sakshi News home page

కాంబోజ్‌ పదునైన బౌన్సర్‌.. కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌

Nov 7 2026 2:13 PM | Updated on Nov 7 2026 2:22 PM

Kamboj-Bouncer-Suffers-Tickner Concussion-Matt Fisher-Replaced-2nd ODI

Photo Credit: Twitter

వెల్లింగ్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ కంకషన్‌కు గురయ్యాడు. కివీస్ బ్యాటింగ్ సమయంలో అన్షుల్ కాంబోజ్ వేసిన బౌన్సర్‌ టిక్నర్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని లెగ్‌సైడ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి నేరుగా టిక్నర్ కుడి చెవి కింద భాగంలో తగిలి ఆపై భుజానికి తాకింది. 

దీంతో పిచ్‌పైనే కిందపడిన టిక్నర్ దగ్గరకు వేగంగా పరిగెత్తుకొచ్చిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌, కాంబోజ్‌లు అతడిని పైకి లేపారు. అయితే కామెంటరీ సమయంలో ఇయాన్ స్మిత్ మాట్లాడుతూ.. ‘టిక్నర్ చెవిలో నుంచి రక్తం రావడం నేను గమనించాను. అతడు ఓకే కదా’ అని పేర్కొన్నాడు. 


Photo Credit: Twitter

అయితే అదే ఓవర్ చివరి బంతికి టిక్నర్ బౌల్డ్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇన్నింగ్స్ గ్యాప్ సమయంలో టిక్నర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో టిక్నర్ స్థానంలో మాథ్యూ ఫిషర్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బౌలింగ్ చేయనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

అయితే తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా కంకషన్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సమయంలో ఫీల్డింగ్ చేస్తూ మాట్ హెన్రీని బలంగా ఢీకొనడంతో కాన్వే తలకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాన్వే వన్డే సిరీస్ మొత్తానికే దూరమైనట్లు కివీస్ బోర్డు తెలిపింది. 

తాజాగా టిక్నర్ గాయం తీవ్రత కూడా ఎక్కువగానే ఉందని ప్రాథమికంగా తేలడంతో ప్రస్తుతం రెండో వన్డేకు దూరమయ్యాడు. మరి సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతాడా లేదా అన్నది తుది రిపోర్టు బట్టి తేలనుంది.

ఇదీ చదవండి: జింబాబ్వేతో టెస్టు.. శతకాలతో చెలరేగిన ఆఫ్గన్ బ్యాటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement