breaking news
Blair Tickner
-
IND vs NZ T20Is: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. యూరోప్ టీ20 లీగ్ మ్యాచ్ సందర్భంగా కివీస్ స్టార్ బ్యాటర్ మార్క్ చాప్మన్ తొడ కండరాల నొప్పితో విలవిల్లాడాడు.ఆ ఇద్దరూ అవుట్‌ఈ గాయం వల్ల చాప్మన్.. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, వన్డే సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. బౌలింగ్ ఆల్‌రౌండర్ జేక్ ఫౌల్క్స్ తుంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పట్లో అతడు మైదానంలో దిగే సూచనలు కనిపించడం లేదు.రీప్లేస్మెంట్ ప్రకటనఇక చాప్మన్, ఫౌల్క్స్ దూరమైన కారణంగా ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్కు భారత్‌తో తలపడే న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు. ‘‘మార్క్, జేక్ దూరమైనందుకు బాధగా ఉంది. వాళ్లిద్దరు త్వరగా కోలుకోవాలి.వీరి స్థానాల్లో క్లార్క్సన్, టిక్నర్ జట్టులోకి వచ్చారు’’ అని వాల్టర్ తెలిపాడు. కాగా సొంతగడ్డపై అక్టోబరు 22 నుంచి నవంబరు 1 వరకు కివీస్ జట్టు టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, కైలీ జెమీసన్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్. చదవండి: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో తెలుసు కదా!: టీమిండియా దిగ్గజం -
న్యూజిలాండ్‌కు భారీ షాక్
వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్ బ్లెయిర్ టిక్నర్ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్ (NZ vs WI)తో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టెస్టులో కివీస్ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్ విండీస్ ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్ (44), బ్రాండన్ కింగ్ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్ టిక్నర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్ డఫీ ఒక వికెట్ తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) సైతం ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ టెయిలెండర్ ఆండర్సన్ ఫిలిప్ (5) రనౌట్ రూపంలో కివీస్‌కు ఓ వికెట్ దక్కింది. నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 66వ ఓవర్లో మైకేల్ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్ ఇమ్లాచ్ ఫైన్ లెగ్ దిశగా బాల్‌ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్ టిక్నర్ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్!దీంతో కివీస్ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్ పరిస్థితి చూసి బౌలర్ మైకేల్ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ 7, డెవాన్ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్ కంటే కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్‌దే పైచేయి కాగా.. టిక్నర్ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు


