మార్క్, జేక్ అవుట్ (PC: Blackcaps X)
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. యూరోప్ టీ20 లీగ్ మ్యాచ్ సందర్భంగా కివీస్ స్టార్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ తొడ కండరాల నొప్పితో విలవిల్లాడాడు.
ఆ ఇద్దరూ అవుట్
ఈ గాయం వల్ల చాప్‌మన్.. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, వన్డే సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. బౌలింగ్ ఆల్‌రౌండర్ జేక్ ఫౌల్క్స్ తుంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పట్లో అతడు మైదానంలో దిగే సూచనలు కనిపించడం లేదు.
రీప్లేస్‌మెంట్ ప్రకటన
ఇక చాప్‌మన్, ఫౌల్క్స్ దూరమైన కారణంగా ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌కు భారత్‌తో తలపడే న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు. ‘‘మార్క్, జేక్ దూరమైనందుకు బాధగా ఉంది. వాళ్లిద్దరు త్వరగా కోలుకోవాలి.
వీరి స్థానాల్లో క్లార్క్‌సన్, టిక్నర్ జట్టులోకి వచ్చారు’’ అని వాల్టర్ తెలిపాడు. కాగా సొంతగడ్డపై అక్టోబరు 22 నుంచి నవంబరు 1 వరకు కివీస్ జట్టు టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు (అప్‌డేటెడ్)
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, కైలీ జెమీసన్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్.
చదవండి: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో తెలుసు కదా!: టీమిండియా దిగ్గజం


