చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్‌ | NZ-Blair Tickner-Rare-Feat-Most-Sixes-Batting-11th Place-Vs IND | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్‌

Nov 4 2026 11:35 AM | Updated on Nov 4 2026 11:52 AM

NZ-Blair Tickner-Rare-Feat-Most-Sixes-Batting-11th Place-Vs IND

Photo Credit: Twitter

ఆక్లాండ్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ బౌల‌ర్ బ్లెయిర్ టిక్న‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే చ‌రిత్ర‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన బ్యాట‌ర్ల జాబితాలో టిక్న‌ర్ చోటు సంపాదించాడు. 4 సిక్స‌ర్లు కొట్టిన టిక్న‌ర్‌, పాకిస్తాన్ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ఆమిర్‌, న‌సీమ్ షాల‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 

గ‌తంలో మ‌హ్మ‌ద్ ఆమిర్ 2016లో నాటింగ్‌హ‌మ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 సిక్స‌ర్లు బాద‌గా, 2025లో న‌సీమ్ షా హామిల్టన్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 4 సిక్స‌ర్లు బాదాడు. తాజాగా 23 బంతుల్లో 34 ప‌రుగులు చేసిన టిక్న‌ర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి.

👉త‌మ సొంత‌గ‌డ్డ‌పై భార‌త్‌తో ఆడిన వ‌న్డేల్లో న్యూజిలాండ్‌కు ఇది నాలుగో అత్య‌ల్ప స్కోరు. గ‌తంలో భారత్‌తో మ్యాచ్‌ల్లో లో-స్కోరింగ్ న‌మోదు చేసిన మూడు సంద‌ర్భాల్లోనూ కివీస్ ఓట‌మి పాల‌వ్వ‌డం గ‌మ‌నార్హం.
142- ఆక్లాండ్‌ 1994 (7 వికెట్ల తేడాతో ఓట‌మి)
157- నేపియ‌ర్‌, 2019 (8 వికెట్ల తేడాతో ఓట‌మి)
168- వెల్లింగ్ట‌న్, 2003 (2 వికెట్లె తేడాతో ఓట‌మి)

👉మ‌రో విష‌య‌మేంటంటే, మ్యాచ్‌లో ఎనిమిది సిక్స‌ర్లు రాగా, అవన్నీ నేరుగా గ్రౌండ్ మీదుగా లేదా వికెట్ వెనుక 'V' ఆకారంలో వచ్చాయి. అయితే వికెట్‌కు ఇరువైపులా ఒక్క సిక్సర్ కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

👉మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ వేదికలో గత రెండు వన్డేల్లో రెండో బ్యాటింగ్‌ చేసిన జట్లు ఓటమిపాలయ్యాయి. ఒక మ్యాచ్‌లో 74 పరుగులకు ఆలౌటైతే, మరో మ్యాచ్‌లో 154 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. కివీస్ 185 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement