PC: Blackcaps X
టీమిండియాతో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మిగిలిన మూడు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ధ్రువీకరించింది.
అందుకే మిగిలిన మ్యాచ్‌లకూ దూరం
కాగా టీమిండియాతో రెండో టీ20 సందర్భంగా 35 ఏళ్ల బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయపడ్డాడు. అయితే, ఇప్పటికీ అతడు మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దీంతో భారత్‌తో మిగిలిన మూడు వన్డేలకు కూడా అతడు దూరమైనట్లు కివీస్ బోర్డు ప్రకటించింది.
ఏడు రోజులు దూరంగానే..
మరోవైపు.. రెండో వన్డే సందర్భంగా కంకషన్‌కు గురైన బ్లెయిర్ టిక్నర్ కూడా టీమిండియాతో మూడు, నాలుగు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదు. వైద్య పరీక్షల్లో అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తేలినప్పటికీ.. ఐసీసీ మ్యాండెటరీ స్టాండ్‌డౌన్ పీరియడ్ నిబంధన ప్రకారం.. ఏడు రోజుల (కంకషన్‌కు గురైన నాటి నుంచి) పాటు ఆటకు దూరంగా ఉండాలి. ఈ క్రమంలో ఐదో వన్డేకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ జట్టుకు దూరమైన నేపథ్యంలో క్రిస్టియన్ కార్క్‌ను కివీస్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. కాగా ఈ ఏడాది వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా క్రిస్టియర్ క్లార్క్ కివీస్ తరఫున చివరగా బరిలోకి దిగాడు.
వాళ్లంతా వెళ్లిపోతారు
ఇండియా-ఎ జట్టుతోనూ మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమిండియాతో టెస్టు సన్నాహకాల్లో భాగంగా.. టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్ నాలుగో వన్డేకు ముందే జట్టును వీడనున్నారు.
ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-3తో భారత్‌కు కోల్పోయిన న్యూజిలాండ్.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి మూడో వన్డేకు హామిల్టన్ వేదిక.
టీమిండియాతో మూడో వన్డేకు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జేకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, కైలీ జెమీషన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్.
టీమిండియాతో నాలుగో వన్డేకు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జేకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, డాన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచెల్ హే (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), విల్ యంగ్.
ఇవీ చదవండి: IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’.. ఊపిరి పీల్చుకున్న కివీస్!
వైభవ్ సూర్యవంశీకి కారు.. ఫొటో అదిరింది


