టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ తన మంచి మనసు చాటుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తనకు లభించిన 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' స్మార్ట్‌ఫోన్ అవార్డును అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. రాహుల్ ఇచ్చిన ఈ బహుమతిపై సదరు మహిళా ఆఫీషియల్ సంతోషం వ్యక్తం చేసింది.
"నాకు రాహుల్ ఫోన్ గిప్ట్‌గా ఇచ్చారు. నిజంగా నేను షాక్ అయ్యాను. అతడిది ఎంతో మంచి మనసు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు" అని ఆమె పేర్కొంది. ఈ వీడియోకు ‘‘ గొప్ప ప్లేయర్.. అంతకంటే గొప్ప మనసు. క్లాస్’’ అని బీసీసీఐ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. కాగా కివీస్‌తో జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకానొక దశలో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (30), కేఎల్ రాహుల్ (26 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత భారత్ 113/7 వద్ద ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. ఆ సమయానికి డీఎల్‌ఎస్ పార్ స్కోరు కంటే 4 పరుగులు ముందంజలో ఉండటంతో విజయం భారత్‌ను వరించింది.
Big player. Bigger heart 💙 🎥 An act of kindness and pure 𝙆𝙇𝙖𝙨𝙨 🙌 #TeamIndia | #NZvIND | @klrahul https://t.co/BgT005WZlp
— BCCI (@BCCI) November 8, 2026


