సెహ్వాగ్‌ కొడుకుపై పాక్ బౌలర్ ఓవరాక్షన్.. నెక్ట్స్ మనోడు చూసుకుంటాడులే! | Pakistan U19 Spinner Naikab Shafiq Faces Criticism For Aggressive Send-Off To India Opener Aryaveer Sehwag In Asia Cup Clash, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND vs PAK: సెహ్వాగ్‌ కొడుకుపై పాక్ బౌలర్ ఓవరాక్షన్.. నెక్ట్స్ మనోడు చూసుకుంటాడులే!

Nov 8 2026 4:30 PM | Updated on Nov 8 2026 4:42 PM

Aaryavir Sehwag Gets A Fiery Send-Off From Pakistan Bowler In Under-19 Asia Cup

అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ యువ స్పిన్నర్ నిఖాబ్ షఫీక్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడు. భారత ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్‌ను ఔట్ అయ్యాక షఫీక్ సెల‌బ్రేష‌న్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఏమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే పాక్ బౌలర్లు గట్టి షాకిచ్చారు. కేవలం 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును క్రీజులో కుదురుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్ ఆదుకుంటాడని అంతా భావించారు. అయితే ఆర్యవీర్ కూడా ఎక్క‌వసేపు త‌న ఇన్నింగ్స్‌ను కొన‌సాగించ‌లేక‌పోయాడు.

ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన నిఖాబ్ షఫీక్ బౌలింగ్‌లో ఆర్యవీర్ (22 పరుగులు, 40 బంతులు) లెగ్ సైడ్ మీదుగా స్లాగ్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ చేతికి చిక్కింది.

ఆర్యవీర్ వికెట్ పడగానే షఫీక్ సంయమనం కోల్పోయి అగ్రెసీవ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. నేరుగా ఆర్యవీర్ వైపు చూస్తూ కోపంతో పెవిలియన్ వైపు వెళ్లాలని దూకుడుగా సైగలు చేస్తూ ఫైరీ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు అతడి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

అంత ఓవ‌రాక్ష‌న్ ఎందుకు.. నెక్ట్స్ మ్యాచ్‌లో నీ ప‌ని ఉందిలే అని ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు నిర్ణీత ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అర్జున్ రాజ్‌పూత్ అద్భుతమైన శతకం (107 పరుగులు) సాధించి జట్టును ఆదుకోగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
చదవండి: BAN vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ప్లేయర్‌.. 48 ఏళ్ల తర్వాత


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement