పాక్‌తో మ్యాచ్‌.. టీమిండియా బ్యాటర్‌ మెరుపు సెంచరీ | ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: Team india all out for 208 runs | Sakshi
Sakshi News home page

పాక్‌తో మ్యాచ్‌.. టీమిండియా బ్యాటర్‌ మెరుపు సెంచరీ

Nov 8 2026 2:17 PM | Updated on Nov 8 2026 2:17 PM

ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: Team india all out for 208 runs

source: X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌ 2026 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ స్వల్ప స్కోర్‌కే (46.3 ఓవర్లలో 208 పరుగులు) ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అర్జున్‌ రాజ్‌పుత్‌ (85 బంతుల్లో 107; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో కదంతొక్కినా, ఓ మోస్తరు స్కోరైనా సాధించలేకపోయింది.

అతడికి మరో ఎండ్‌లో ఎవరి సహకారం​ లభించలేదు. స్టార్‌ బ్యాటర్లు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (22), ఆన్వయ్‌ ద్రవిడ్‌ (10) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. కెప్టెన్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందని డకౌట్‌ కాగా.. వీకే వినీత్‌ 8, యశ్‌వర్దన్‌ చౌహాన్‌ 1, మనల్‌ చౌహాన్‌ 11, యశ్‌వీర్‌ గౌడ్‌ 4, మోహిత్‌ ఉల్వ 7 పరుగులకు ఔటయ్యారు. ఆఖర్లో కావ్య పటేల్‌ (23) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్‌ 200 పరుగుల మార్కు దాటింది.

పాక్‌ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్‌ షఫీక్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్‌ సయ్యమ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.  

ఇదీ చదవండి: ఆసియా కప్‌కు భారత స్టార్‌ బ్యాటర్‌ దూరం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement