టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ | Rishabh Pant Declared Fit, To Play 1st Test vs New Zealand says Report | Sakshi
Sakshi News home page

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Nov 7 2026 12:35 PM | Updated on Nov 7 2026 12:43 PM

Rishabh Pant Declared Fit, To Play 1st Test vs New Zealand says Report

source: X

భారత క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. తొలుత గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. తాజాగా అతడు కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించడం టీమిండియాకు భారీ ఊరట కలిగించే అంశం.

నివేదికల ప్రకారం.. పంత్ వచ్చే వారం న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడు. తొలి టెస్టులో ఆడేందుకు అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో మ్యాచ్ సిమ్యులేషన్‌లో పాల్గొన్న పంత్.. ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు.

ఇరానీ కప్‌ సందర్భంగా గాయం
పంత్‌ ఇరానీ కప్‌ సందర్భంగా సైడ్ స్ట్రెయిన్ గాయానికి గురయ్యాడు. తొలుత భావించిన దానికంటే గాయం తీవ్రంగా ఉండటంతో.. న్యూజిలాండ్-ఏతో భారత్-ఏ ఆడిన తొలి రెండు అనధికారిక టెస్టులకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం పంత్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ మూడో అనధికారిక టెస్టులోనూ ఆడటం లేదు. అతడి స్థానంలో తిలక్ వర్మ భారత్-ఏ జట్టులోకి చేరాడు.

ఇవాళే ప్రారంభమైన మూడో టెస్ట్‌
న్యూజిలాండ్‌-ఏతో మూడో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ లింకన్‌ వేదికగా ఇవాళే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ద్‌ కృష్ణతో పాటు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా ఆడుతున్నారు.

జైస్వాల్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌-ఏ
న్యూజిలాండ్‌-ఏతో మూడో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌-ఏ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 227-2గా ఉంది. రెండో టెస్ట్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌ (102) ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ చేశాడు. 

సాయి సుదర్శన్‌ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పడిక్కల్‌ (15) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. సాయితో పాటు జురెల్‌ (12) క్రీజ్‌లో ఉన్నాడు. 

ఇదీ చదవండి: టెస్ట్‌లో షమీ అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement