Photo Credit: Twitter
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డే ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల 38వ పుట్టినరోజు జరుపుకున్న విరాట్ కోహ్లి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం అంతరాయం కారణంగా టాస్ ఆలస్యమైన వేళ, కోహ్లి, రాహుల్ మధ్య ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది.
కేఎల్ రాహుల్ తన జెర్సీపైన మరో షర్ట్ ధరించాడు. కానీ అది సరిగ్గా కుదరకపోవడంతో రాహుల్ ఇబ్బంది పడ్డాడు. డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన సిబ్బంది ఒకరు తనతో పాటు తెచ్చిన కత్తెరతో రాహుల్ మెడ దగ్గర షర్ట్ నెక్ కాలర్‌ను కాస్త కట్ చేశాడు. ఇది గమనించిన కోహ్లి వారి మధ్యలో దూరి రాహుల్ సమస్యను క్షణాల్లో పరిష్కరించాడు.
రాహుల్ ధరించిన ఓవర్ షర్ట్‌ను వెనక్కి లాగి లోపల ఉన్న షర్ట్ కాలర్‌ను సరిగ్గా సెట్ చేశాడు. ఈ సమయంలో కోహ్లి, రాహుల్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ అద్బుతంగా అందుకున్నాడు. దీంతో అకిబ్ నబీ ఖాతాలో రెండో వికెట్ చేరింది. అంతకముందు ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను డకౌట్ చేసిన అకిబ్ నబీ తొలి అంతర్జాతీయ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లి 51 బంతుల్లో 74 పరుగులు బాది జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగడంతో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (55) అర్థశతకం సాధించగా, మిచెల్ సాంట్నర్ (31) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు తీయగా, అకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
King Kohli looking out for his boys! 🥹🤌 Watch #NZvIND 2nd ODI LIVE now on #SonySportsNetwork & #SonyLIV! https://t.co/WXid8tdvKl
— Sony LIV (@SonyLIV) November 7, 2026
ఇదీ చదవండి:


