వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన జైస్వాల్‌ | IND A VS NZ A 3rd Un Official Test: Yashasvi Jaiswal Slams Hundred | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన జైస్వాల్‌

Nov 7 2026 8:19 AM | Updated on Nov 7 2026 8:19 AM

IND A VS NZ A 3rd Un Official Test: Yashasvi Jaiswal Slams Hundred

source: X

న్యూజిలాండ్‌ గడ్డపై భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. లింకన్‌ వేదికగా భారత్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ మధ్య ఇవాళ మూడో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ మొదలైంది.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ శతక్కొట్టాడు. 138 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌తో కలిసి జైస్వాల్‌ తొలి వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. జైస్వాల్‌ ఔటయ్యాక సాయికి దేవ్‌దత్‌ పడిక్కల్‌ జతకలిశాడు. రెండో సెషన్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 52 ఓవర్లలో 185-1గా ఉంది. సాయి 61, పడిక్కల్‌ 5 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు.

కాగా, భారత-ఏ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ సిరీస్‌ భారత రెగ్యులర్‌ జట్టు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 

ఈ సిరీస్‌ అనంతరం​ టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. టీమిండియా ఆటగాళ్లకు న్యూజిలాండ్‌లో పరిస్థితులు అలవాటు పడేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది. భారత టెస్ట్‌ జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో పాల్గొంటున్నారు. యశస్వి జైస్వాల్‌ కూడా అందులో ఒకడు. 

ఇదీ చదవండి: కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ.. అధికారిక ప్ర‌క‌ట‌న‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement