మూడో టెస్టుకూ పంత్ దూరం.. ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మ..! | Rishabh Pant Ruled Out Of 3rd Unofficial Test vs New Zealand A | Sakshi
Sakshi News home page

మూడో టెస్టుకూ పంత్ దూరం.. ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మ..!

Nov 5 2026 8:00 PM | Updated on Nov 5 2026 8:09 PM

Rishabh Pant Ruled Out Of 3rd Unofficial Test vs New Zealand A

source: X

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్‌ పంత్ మైదానంలోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పంత్.. మూడో టెస్టులోనూ ఆడటం లేదని ఓ నివేదిక వెల్లడించింది. అతడి స్థానంలో తిలక్ వర్మను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇరానీ కప్ సందర్భంగా పక్కటెముకల పక్కన కండరాల గాయానికి గురైన పంత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో అతడికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పంత్ పునరావాస చికిత్స తీసుకుంటున్నాడు.

కాగా, ధ్రువ్ జురెల్ నాయకత్వంలోని భారత్-ఏ జట్టు న్యూజిలాండ్‌-ఏతో జరిగిన తొలి రెండు అనధికారిక టెస్టులను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.

తిలక్ వర్మకు మంచి రికార్డు
తిలక్ వర్మకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన అతడు 38 ఇన్నింగ్స్‌ల్లో 57.12 సగటుతో 1,828 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.

జట్టులోకి బుమ్రా, జడేజా
మరోవైపు టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా భారత్-ఏ జట్టుతో చేరారు. లింకన్ వేదికగా జరగనున్న మూడో అనధికారిక టెస్టులో వీరిద్దరూ ఆడనున్నారు. న్యూజిలాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.

ఇదీ చదవండి: భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement