క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్, ఇండియా-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆటకు చివరిరోజైన నాలుగో రోజున భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, యశ్ రాథోడ్ అజేయ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 52.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జైస్వాల్ (155 నాటౌట్), యశ్ రాథోడ్ (100 నాటౌట్) అజేయంగా నిలిచారు.
కివీస్ బౌలర్లలో బ్రెట్ రాండెల్, జర్రోడ్ మెక్‌కే చెరొక వికెట్ తీశారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రోజు ముగిసేసరికి ఫలితం రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జట్టు ఓవర్‌కు 5.27 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం.
ఓపెనర్ సాయి సుదర్శన్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పడిక్కల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరినప్పటికీ, సెంచరీతో జైస్వాల్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభవార్త అని చెప్పొచ్చు. జైస్వాల్, యశ్ రాథోడ్‌లు కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 247 పరుగులు (242 బంతులు) జోడించారు.
అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బొలె (110) సెంచరీ చేయగా, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (93) శతకం మిస్ చేసుకున్నాడు. ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు తీయగా, సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 7న జరగనుంది.
After low scores of 17,5 & 0 in his last three inning on this tour in Unofficial tests against Nz A. Its good to see Jaiswal making a brilliant Hundred today at Hagley Oval. Good Signs for team India ahead of 2 match test series. https://t.co/MsSrxOWhQ4
— Aj Bal Sports (@AjBalSports) November 3, 2026
ఇదీ చదవండి: 'హర్మన్‌ప్రీత్ నా ఫోన్‌కాల్స్ ఎత్తలేదు'


