మాయ పరాజయం | Maya Rajeswaran loses in the quarterfinals of the Chennai Open WTA 250 tournament | Sakshi
Sakshi News home page

మాయ పరాజయం

Nov 7 2026 3:47 AM | Updated on Nov 7 2026 3:47 AM

Maya Rajeswaran loses in the quarterfinals of the Chennai Open WTA 250 tournament

చెన్నై: భారత టెన్నిస్‌ రైజింగ్‌ స్టార్‌ మాయ రాజేశ్వరన్‌ చెన్నై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–250 టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 17 ఏళ్ల మాయ 3–6, 3–6తో రాబిన్‌ మోంట్‌గోమెరీ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తాజా ప్రదర్శనతో మాయ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 180 స్థానాలు ఎగబాకనుంది. సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో మాయ 669వ ర్యాంక్‌ నుంచి 489వ ర్యాంక్‌కు చేరుకోనుంది.

మరోవైపు డబుల్స్‌ విభాగంలోనూ మాయ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రషి్మక–మాయ ద్వయం 3–6, 4–6తో ఇసాబెల్లి హావెర్లాగ్‌ (నెదర్లాండ్స్‌)–పన్నా ఉడ్వార్డి (హంగేరి) జోడీ చేతిలో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లో 7–5, 6–4తో జోడీ బురేజ్‌ (బ్రిటన్‌)–రాబిన్‌ మోంట్‌గోమెరీ (అమెరికా) జంటపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement