భారత స్క్వాష్ స్టార్ అనాహత్ సింగ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అనాహత్‌తో పాటు తన్వీ, అభయ్, వీర్ చొత్రాని కూడా క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–4, 11–5, 11–7తో వై ఇయాన్ యోంగ్ (సింగపూర్) పై విజయం సాధించింది. మహిళా బాక్సర్ సాక్షి 51 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–3తో బల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడింది. పురుషుల 70 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సుమిత్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో ప్రణతి నాయక్ ఆరో స్థానంలో నిలిచింది.


