IND vs PAK: స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం: పాక్‌ కెప్టెన్‌ | IND vs PAK If we want to win gold have to beat top teams: Pak Captain | Sakshi
Sakshi News home page

IND vs PAK: స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం: పాక్‌ కెప్టెన్‌

Sep 24 2026 6:40 PM | Updated on Sep 24 2026 7:03 PM

IND vs PAK If we want to win gold have to beat top teams: Pak Captain

ఫర్హాన్‌ - శ్రేయస్‌ అయ్యర్‌ (PC: PCB/BCCI)

జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు-2026లో పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌కు గురువారం (సెప్టెంబరు 24) తెరలేచింది. గ్రూప్‌ దశలో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై జపాన్‌పై 48 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను మలేషియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు
ఇదిలా ఉంటే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా టీమిండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, క్వార్టర్‌ ఫైనల్‌ లేదంటే సెమీస్‌లో ఈ దాయాదుల పోరును చూసే అవకాశం లేదు. టోర్నీ విధానం ప్రకారం భారత్‌- పాక్‌ రెండు వేర్వేరు పూల్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఫైనల్‌ లేదంటే.. కాంస్య పతక పోరు కోసం జరిగే మ్యాచ్‌లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.

ప్రతీ మ్యాచ్‌ మాకు ముఖ్యమైనదే
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సాహిబ్‌జాదా ఫర్హాన్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా దృష్టి కేవలం టీమిండియాతో మ్యాచ్‌పై మాత్రమే లేదు. టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్‌ మాకు ముఖ్యమైనదే. ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము.

స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం
కేవలం టీమిండియా మ్యాచ్‌ కోసం మాత్రమే మేము సన్నద్ధం కావడం లేదు. ముందుగా చెప్పినట్లు ప్రతీ మ్యాచ్‌ మాకు కీలకమే. ఎవరిని ఓడించాలనుకుంటున్నాం.. ఎవరిపై గెలవాలనుకుంటున్నాం అన్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. 

స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం. అందుకు అన్ని జట్లను ఓడించాల్సి ఉంటుంది’’ అని సాహిబ్‌జాదా ఫర్హాన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా- పాకిస్తాన్‌ 17 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్‌ పద్నాలుగుసార్లు గెలుపొందింది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో భారత్‌ పసిడి పతకం గెలిచింది.

చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. చరిత్రకు అడుగుదూరంలో కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement