PC: X
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి. తద్వారా పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. కాగా గురువారం తొలుత వుషు అథ్లెట్ రోషిబినా దేవి భారత్‌కు పతకాన్ని అందించింది.
రోషిబినాకు రజతం
మహిళల అరవై కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాయు ఝాంగ్‌తో తలపడ్డ రోషిబినా.. దురదృష్టవశాత్తూ 2-0 తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆమె రజత పతకం సాధించింది. కాగా ఆఖరి నిమిషంలో రోషిబినా ఆసియా క్రీడల బృందంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా దివ్యాంశి చౌదరి స్థానంలో ఆమె వచ్చి చేరగా.. దివ్యాంశి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే, ఆఖరికి ఆమె వెనక్కి తగ్గగా.. రోషిబినా పతకంతో మెరిసి తన ఎంపిక సరైందేనని నిరూపించుకుంది.
మరో రెండు కాంస్యాలు
ఇక డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం గెలిచారు. మరోవైపు.. స్కీట్ షూటింగ్ మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్ కాంస్యం సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు మహిళల క్రికెట్‌లో స్వర్ణంతో పాటు.. ఆరు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు లభించాయి. పట్టికలో భారత్ ప్రస్తుతానికి పద్నాలుగో స్థానంలో నిలిచింది.
చదవండి: చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు


