బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్‌.. జపాన్‌ మరో పోరాటం | Asian Games 2026: Afghanistan mens cricket team beat Japan by 48 runs | Sakshi
Sakshi News home page

Asian Games 2026: బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్‌.. జపాన్‌ మరో పోరాటం

Sep 24 2026 9:24 AM | Updated on Sep 24 2026 9:24 AM

Asian Games 2026: Afghanistan mens cricket team beat Japan by 48 runs

source: X

ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల క్రికెట్‌ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో పసికూన, ఆతిథ్య జపాన్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా జపాన్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీనికి ముందు టీమిండియాతో జరిగిన చారిత్రక మ్యాచ్‌లోనూ జపాన్‌ బౌలర్లు సత్తా చాటారు.

ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేసిన జపాన్‌ బౌలర్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇబ్బందిపెట్టారు. తమకంటే చాలా మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌ను జపాన్‌ కేవలం 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. 

జపాన్‌ బౌలర్లు వికెట్లు పెద్దగా తీయలేకపోయినా పరుగులు నియంత్రించారు. షోమా స్లేటర్‌, ఇబ్రహాం తలో 2, బెంజమిన్‌, థామస్‌ చెరో వికెట్‌ తీశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్‌ అక్రమ్‌ (34), కరీం జనత్‌ (21), కెప్టెన్‌ దర్విష్‌ రసూలీ (29) రెండంకెల స్కోర్లు చేయగా..ఆఖర్లో మొహమ్మద్‌ ఇషాక్‌ (25 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం బ్యాటింగ్‌లో మాత్రం జపాన్‌ చేతులెత్తేసింది. ముగ్గురు మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. గుల్‌ మొమంద్‌ (4-2-8-4), ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌ (3-0-13-2) ధాటికి జపాన్‌ 19.3 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్‌.. జనాలకు బోర్‌ కొట్టదా..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement