source: X
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఐదో రోజు (సెప్టెంబర్ 24) పోటీల్లో భారత వుషూ స్టార్ నౌరెమ్ రోషిబినా దేవి రజత పతకాన్ని సాధించింది. మహిళల 60 కేజీల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాయు ఝాంగ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. వరుసగా మూడో ఆసియా గేమ్స్‌లోనూ పతకం సాధించి అరుదైన ఘనతను అందుకుంది.
రోయింగ్‌లో రజతం
మరోవైపు, పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
నాలుగో రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు చాలా కాలం తర్వాత పతకం (మీరాబాయ్ చాను) లభించగా.. అదే జోరును ఐదో రోజూ కొనసాగించాలని భారత అథ్లెట్లు పట్టుదలతో ఉన్నారు. ఇవాల్టి నుంచి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానుండగా.. షూటింగ్, హాకీ, కబడ్డీ ఈవెంట్లలోనూ భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.
ఇప్పటివరకు భారత్ మహిళల క్రికెట్‌లో స్వర్ణం, 5 రజతాలు, 7 కాంస్య పతకాలతో (మొత్తం 13) పట్టికలో 13వ స్థానంలో కొనసాగుతుంది. చైనా మొత్తం 80 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
ఇదీ చదవండి: మీరా కల నెరవేరె...


