కాంస్యంతో ‘జై’... | Jai Meena becomes first Indian player to win a medal in soft tennis at Asian Games 2026 | Sakshi
Sakshi News home page

కాంస్యంతో ‘జై’...

Sep 24 2026 4:04 AM | Updated on Sep 24 2026 4:04 AM

Jai Meena becomes first Indian player to win a medal in soft tennis at Asian Games 2026

ఆసియా క్రీడల సాఫ్ట్‌ టెన్నిస్‌ క్రీడాంశంలో పతకం అందించిన తొలి భారతీయ ప్లేయర్‌గా జై మీనా చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల జై మీనా 2–4 (3–5, 1–4, 1–4, 4–1, 6–4, 1–4)తో జపాన్‌ ప్లేయర్‌ టకుయా కురోసాకా చేతిలో ఓడిపోయాడు. సాఫ్ట్‌ టెన్నిస్‌లో సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకం లభిస్తుంది. 1994 హిరోషిమా ఆసియా క్రీడల నుంచి సాఫ్ట్‌ టెన్నిస్‌ మెడల్‌ ఈవెంట్‌గా ఉంది. 

వరుసగా మూడో ఆసియా క్రీడల్లో పోటీపడుతున్న జై మీనా 2018 జకార్తా గేమ్స్‌లో లీగ్‌ దశలోనే వెనుదిరగ్గా... 2023 హాంగ్జౌ క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. ‘నాకిది ఒలింపిక్‌ పతకంలాంటిది. గతంలో కీలకదశలో తడబడ్డా.. ఈసారి ఒత్తిడిని అధిగమించి పతకాన్ని సాధించాను’ అని 2024 ప్రపంచ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో  కాంస్యం, 2024 ఆసియా చాంపియన్‌షిప్‌ సింగిల్స్‌ విభాగంలో కాంస్యం గెలిచిన జై మీనా వ్యాఖ్యానించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement