ఆసియా క్రీడ‌ల్లో చిచ్చరపిడుగు.. 13 ఏళ్లకే హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ | 13-year-old Chinese athlete Yu Zidi wins three gold medals at Asian Games 2026 | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడ‌ల్లో చిచ్చరపిడుగు.. 13 ఏళ్లకే హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌

Sep 23 2026 9:30 PM | Updated on Sep 23 2026 9:31 PM

13-year-old Chinese athlete Yu Zidi wins three gold medals at Asian Games 2026

జ‌పాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌లు-2026లో చైనా యువ స్విమ్మ‌ర్ 13 ఏళ్ల యు జిడి త‌న  అద్భుత ప్రదర్శనతో అద‌ర‌గొడుతోంది. ఈ చిచ్చ‌ర‌పిడుగు తన అసాధారణ ప్రతిభతో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల  వ్యక్తిగత మెడ్లే రేసును యు జిదీ కేవలం 4 నిమిషాల 28.56 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. 

తన తోటి క్రీడాకారిణి కెవెన్‌క్సి కంటే 3.95 సెకన్ల ముందుగా ముగించి ఆమె విజయం సాధించింది. యుజిడి గోల్డ్‌మెడ‌ల్‌తో పాటు గత ఆసియా క్రీడల రికార్డును 4.5 సెకన్ల వ్యత్యాసంతో బద్దలు కొట్టింది. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్‌లో అత్యంత వేగవంతమైన రేసర్ల జాబితాలో  జ‌డి నాలుగో స్థానంలో నిలిచింది. 

ఈ జాబితాలో మొదటి మూడు అత్యుత్తమ టైమింగ్స్ ప్రపంచ రికార్డు కెనడా స్టార్ స్విమ్మర్ 'సమ్మర్ మెకింటోష్' పేరిటే ఉన్నాయి. యుజిడి అంత‌కుముందు 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీట‌ర్ల  వ్యక్తిగత మెడ్లే విభాగాల్లో బంగారు ప‌త‌కం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement