జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.
ఈ ఈవెంట్‌లో చైనా స్వర్ణం సాధించగా.. కజకిస్తాన్ రజతంతో సరిపెట్టుకుంది. షూటింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కాగా.. మొత్తంగా ఎనిమిదో పతకం (ఒక గోల్డ్, 4 సిల్వర్, 3 బ్రాంజ్).
ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 58 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
కాగా, నాలుగో రోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటకే షూటింగ్‌లో మహిళల స్కీట్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించగా, స్టార్ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు, సాఫ్ట్ టెన్నిస్‌లో జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ఆ క్రీడలో ఆసియా గేమ్స్ చరిత్రలో తొలి పతకం ఖాయమైంది.
ఇదీ చదవండి: 'మన బంగారం' మహిళా క్రికెటర్లు


