ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్స్‌లో అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచిక తలపడింది .
హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్‌లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు.

రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అని సుచిక ఓటమి అనంతరం పేర్కొంది.
రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్‌లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది.
సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రత్యర్థి క్రీడాకారిణితో కరచాలనం చేయకపోవడంపై మిశ్రమ స్పందన వచ్చింది. జాతీయ జెండాను మెడలో వేసుకొని సుచిక తరియాల్ ఇలా ప్రవర్తించడం ద్వారా భారతదేశాన్ని అవమానించినట్లేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం సుచిక చర్యను సమర్థించారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందినది కావడం, ప్రత్యర్థి కూడా అదే దేశానికి చెందడంతో, బరువు పేరు చెప్పి సుచికకు అన్యాయం చేశారన్నది వారి వాదన. ఇది ఎలా ఉన్నా ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.
Indian Semi-Finalist Suchika refuses to accept loss in MMA at Asian Games 2026 against Singaporean Player
Suchika lost a dramatic semifinal to Singapore’s Tiffany Teo after regulation time ended in a draw.
The 1-minute overtime was initially awarded 2–1 to Teo. India protested,… pic.twitter.com/nOU2HkrGBd— Mogambo (@Netajinonsense1) September 22, 2026
🚨 SUCHIKA TARIYAL - ASIAN GAMES BRONZE🥉MEDALIST
Suchika Bags Bronze in Traditional 60kg MMA 🇮🇳
She felt she was robbed of the victory & it felt unacceptable (check video). Score 0-2 vs 🇸🇬
But keep your head high. A historical medal 🇮🇳pic.twitter.com/KRn9DGG8bo— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 21, 2026
ఇదీ చదవండి: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’


