breaking news
Suchika Tariyal
-
'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు'
ఆసియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందించిన సుచికా తరియాల్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సుచికా సంచలన వ్యాఖ్యలు చేసింది. విచిత్రమైన బరువు నిబంధనల కారణంగా తనకు దక్కాల్సిన స్వర్ణ పతకాన్ని లాక్కున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది."నేను సెమీఫైనల్ బౌట్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాను. కానీ రిఫరీలు ఆ మ్యాచ్‌ను 'డ్రా'గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం డ్రా అయినప్పుడు మరో రౌండ్ పోటీ నిర్వహించాలి. కానీ అలా చేయకుండా అత్యంత విచిత్రమైన బరువు నిబంధనలను వర్తింపజేశారు. దీంతో నాకు దక్కాల్సిన స్వర్ణపతకం చేజారింది. వెయిట్-ఇన్ రూల్ ఒక చెత్త నిబంధన. నన్ను మరో రౌండ్ ఆడటానికి అనుమతించి ఉండాల్సింది. ఒకవేళ ఆ రౌండ్లో ఓడిపోయినా నేను దాన్ని అంగీకరించేదాన్ని. కానీ ఇలా అర్ధాంతరంగా ముగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ నావరకు అయితే కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తాననిపించింది. తీవ్రంగా శ్రమించి సెమీఫైనల్ స్థాయికి చేరుకున్నాను. అక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదు.అదనంగా కేటాయించిన ఆ ఒక్క నిమిషం రౌండ్లో కూడా నేను ఆమెపై ఆధిపత్యం ప్రదర్శించాను. ప్రత్యర్థి వెనక్కి పారిపోతుంటే నేను దాడి చేస్తూనే ఉన్నాను. ఈ క్రీడా సమాఖ్య సింగపూర్‌కు చెందినదే కావడం వల్ల, బహుశా ఆమెను గెలిపించాల్సి వచ్చిందేమో" అని పీటీఐతో మాట్లాడుతూ సుచికా ఆరోపించింది.అసలు ఏమి జరిగిందంటే?జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియడ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించింది. సింగపూర్‌కు చెందిన టీ హుయ్ హూన్తో జరిగిన సెమీఫైనల్లో సుచికా అద్భుత ప్రదర్శన చేసినా 'వెయిట్ రూల్' కారణంగా రజతం/పసిడి పోరుకు దూరమై కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 700 గ్రాముల బరువు వ్యత్యాసంతో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.ఈ సెమీస్ పోరులో తొలి రౌండ్లో సుచికా కాస్త వెనకబడినప్పటికీ, రెండో రౌండ్లో అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో మ్యాచ్ ఓవర్ టైమ్‌కు వెళ్లింది. ఓవర్ టైమ్ పూర్తయ్యాక కూడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది.అయితే మరో రౌండ్ నిర్వహించకుండా రిఫరీలు "వెయిట్-బేస్డ్ టైబ్రేకర్" నిబంధనను అమలు చేశారు. ఉదయం జరిగిన వెయిట్-ఇన్ లెక్కల ప్రకారం సుచికా కంటే సింగపూర్ అథ్లెట్ కేవలం 700 గ్రాములు తక్కువ బరువు ఉంది. ఆ నిబంధన ప్రకారమే తక్కువ బరువు ఉన్న సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించి ఫైనల్‌కు పంపారు. -
‘అంతా తొండి.. అందుకే కరచాలనం చేయలేదు’
ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్స్‌లో అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచిక తలపడింది .హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు.రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అని సుచిక ఓటమి అనంతరం పేర్కొంది.రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రత్యర్థి క్రీడాకారిణితో కరచాలనం చేయకపోవడంపై మిశ్రమ స్పందన వచ్చింది. జాతీయ జెండాను మెడలో వేసుకొని సుచిక తరియాల్ ఇలా ప్రవర్తించడం ద్వారా భారతదేశాన్ని అవమానించినట్లేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం సుచిక చర్యను సమర్థించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందినది కావడం, ప్రత్యర్థి కూడా అదే దేశానికి చెందడంతో, బరువు పేరు చెప్పి సుచికకు అన్యాయం చేశారన్నది వారి వాదన. ఇది ఎలా ఉన్నా ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.Indian Semi-Finalist Suchika refuses to accept loss in MMA at Asian Games 2026 against Singaporean PlayerSuchika lost a dramatic semifinal to Singapore’s Tiffany Teo after regulation time ended in a draw.The 1-minute overtime was initially awarded 2–1 to Teo. India protested,… pic.twitter.com/nOU2HkrGBd— Mogambo (@Netajinonsense1) September 22, 2026 🚨 SUCHIKA TARIYAL - ASIAN GAMES BRONZE🥉MEDALISTSuchika Bags Bronze in Traditional 60kg MMA 🇮🇳She felt she was robbed of the victory & it felt unacceptable (check video). Score 0-2 vs 🇸🇬But keep your head high. A historical medal 🇮🇳pic.twitter.com/KRn9DGG8bo— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 21, 2026ఇదీ చదవండి: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’ -
వేధింపుల బాధితురాలి నుంచి...
పన్నెండేళ్ల వయసులో కుర్రాళ్లు ఏడిపిస్తుంటే... వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆత్మరక్షణ విద్య నేర్చుకున్న ఆ చిన్నది... ఇప్పుడు 36 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల్లో దేశానికి పతకం ఖాయం చేసింది. ‘ఆడపిల్లలు లేడి పిల్లలుగా కాకుండా... పులి పిల్లలుగా మారాలని’ బలంగా నమ్మి ఏళ్ల పాటు దాని కోసం కృషి చేసిన హరియాణాకు చెందిన సుచికా తరియాల్... ఏషియన్ గేమ్స్‌లో కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది.వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండిపోకుండా... పోరాడటం నేర్చుకోవాలని కరాటేలో శిక్షణ తీసుకున్న సుచికా... తాజా ఆసియా క్రీడల్లో సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ‘దేశానికి పతకం అందించబోతుండటం ఆనందంగా ఉంది. సోమవారం స్వర్ణ పతకం కోసం పోరాడతా. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఫైటింగ్ నేర్చుకోవాలనే కల ఉండేది. అందుకే తొలుత జూడోను ఎంచుకున్నా. ఆ ప్రయాణం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మాది సంప్రదాయ కుటుంబం కావడంతో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా... ఆ తర్వాత నా పట్టుదల చూసి అంతా సహకరించారు. ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీని వెనక కఠోర శ్రమ దాగి ఉంది’ అని సుచిక వెల్లడించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి ఎంఎంఏ క్రీడాంశాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో స్ట్రైకింగ్, టేక్‌డౌన్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ ఆధారంగా పాయింట్లు కేటాయించి విజేతను ప్రకటిస్తారు. జూడో నుంచి మొదలై... రోహ్తక్కు చెందిన సుచిక మొదట జూడోలో శిక్షణ తీసుకుంది. అక్కడి నుంచి జు–జుట్సుకు మారిన ఆమె... ఇప్పుడు ఎంఎంఏలో సత్తా చాటింది. భోపాల్ ‘సాయ్’ కేంద్రంలో రాటుదేలిన సుచిక... ఇప్పటి వరకు 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడింది. ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో పాటు పలు పతకాలు ఖాతాలో వేసుకుంది. 2019 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్, 2019 దక్షిణాసియా గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించిన ఈ హరియాణా ఫైటర్... 2018 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో త్రుటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయిన సుచిక... ఎట్టకేలకు తాజా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలవనుంది. జూడో నుంచి జు–జుట్సుకు మారిన అనంతరం... 2024 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గింది. 2017లోనే ఎంఎంఏలో అరంగేట్రం చేసిన ఆమె జూడో మీద దృష్టి పెట్టేందుకు ఏడేళ్ల పాటు ఎంఎంఏకు దూరమైంది. 2024లో ఎంఎంఏలో పునరాగమనం చేసిన సుచిక... బహ్రెయిన్‌లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92లో విజయం సాధించింది. సీఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించిన సుచికా... ప్రస్తుతం హరియాణా క్రీడా శాఖలో జూనియర్ కోచ్‌గా వ్యవహరిస్తోంది.


