Photo Credit: Twitter
అక్టోబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ బుధవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని జట్టులో టీ20 స్పెషలిస్ట్‌లైన టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్‌లు చోటు దక్కించుకోగా, గాయంతో రచిన్ రవీంద్ర టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. ఇక ఏడాది గ్యాప్ తర్వాత ఆడమ్ మిల్నే తిరిగి జట్టులోకి వచ్చాడు.
స్పిన్ ఆల్‌రౌండర్ మైకెల్ బ్రాస్‌వెల్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదే విషయమై బ్లాక్‌క్యాప్స్ కోచ్ వాల్టర్ మాట్లాడుతూ.. "భారత్‌తో టీ20 సిరీస్ కావడంతో ఫుల్ స్ట్రెంత్‌తో బరిలోకి దిగుతున్నాం. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాం. ఎంతైనా వాళ్లు టీ20 వరల్డ్ చాంపియన్స్" అని పేర్కొన్నాడు.
ఇక అక్టోబర్ 22న మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 22న , రెండో టీ20 అక్టోబర్ 24న, మూడో టీ20 అక్టోబర్ 27న, నాలుగో టీ20 అక్టోబర్ 30న, ఐదో టీ20 నవంబర్ 1న జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 4 నుంచి నవంబర్ 15 మధ్య జరగనుంది. ఇక చివరగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు, రెండో టెస్టు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి.
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్.
ఇదీ చదవండి: విల్ జాక్స్ అరుదైన ఫీట్.. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన లంక


