breaking news
adam milne
-
మిల్నేకు పిలుపు
వెల్లింగ్టన్: జాతీయ కాంట్రాక్ట్ తీసుకునేందుకు నిరాకరించిన న్యూజిలాండ్ సీనియర్ ఓపెనర్ డెవాన్ కాన్వేను... ముక్కోణపు టి20 టోర్నమెంట్‌కు ఎంపిక చేయలేదు. వచ్చేనెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో కలిసి న్యూజిలాండ్ జట్టు టి20 టోర్నమెంట్ ఆడనుంది. ఈ ముక్కోణపు పోటీకి జింబాబ్వే ఆతిథ్యమిస్తుండగా... దీని కోసం న్యూజిలాండ్ బోర్డు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ ఓపెనర్ కాన్వేకు చోటు దక్కలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా అతడు జాతీయ కాంట్రాక్ట్‌ను వదులుకోగా... ఈ టోర్నీకి అందుబాటులో ఉండనని మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రకటించాడు. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో మిడిలెసెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 23 ఏళ్ల బెవాన్ జాకబ్‌కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేసినా... మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. మేజర్ లీగ్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఆడమ్ మిల్నే, టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్‌లను తిరిగి జట్టులోకి వచ్చారు. అలెన్ ఇటీవల ఈ లీగ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 19 సిక్స్‌లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో చివరిసారి మిల్నే న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగాడు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ సారథ్యం వహించనున్నాడు. ‘ముక్కోణపు టోర్నీ కోసం బలమైన జట్టును ఎంపిక చేశాం. ఐపీఎల్ కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌కు అందుబాటులో లేని పలువురు ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. వారంతా మెరుగైన ప్రదర్శన కనబరుస్తారనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. వచ్చే నెల 14–26 వరకు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మూడు జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురు.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌటైంది. ఆడమ్ మిల్నే (4/34), ట్రెంట్ బౌల్ట్ (2/33), మెక్‌కొంచి (2/18) బంగ్లా పతనాన్ని శాశించగా.. లోకి ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో (76) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తౌహిద్ హ్రిదోయ్ (18), ముష్ఫికర్ రహీమ్ (18), మహ్మదుల్లా (21), మెహిది హసన్ (13) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ యంగ్ (70), హెన్రీ నికోల్స్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్ (28), టామ్ బ్లండెల్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్!
ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్ బెన్ లిస్టర్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. నాలుగు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 10న సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు మిల్నే గాయ పడడం జట్టు మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "ఆడమ్ మిల్నే మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండంతో అతడిని ఈ సిరీస్‌లో ఆడించి రిస్క్ చేయకూడదని భావించాము. అందుకే అతడికి విశ్రాంతిని ఇచ్చాము. వరల్డ్‌కప్‌కు ఆటగాళ్లు గాయపడకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఇక బెన్ లిస్టర్ కూడా ప్రస్తుతం జట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. దీంతో వెంటనే అతడు మిల్నే స్ధానాన్ని భర్తీ చేశాడు. బెన్ యూఏఈ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌లో వార్మప్ మ్యాచ్‌లలో మమ్మల్ని ఆకట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ! -
థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్‌కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్ పెరెరా(35), చరిత్ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్ మదుషాన్(1), దిల్షాన్ మదుషంక(0)లను పెవిలియన్‌కు పంపాడు. మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్ మిల్నే విజృంభణతో డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్‌ను ఛేదించింది. దసున్ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతుమ్ నిసాంక బ్యాట్‌ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్ పదును చూపించాడు మిల్నే. తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా న్యూజిలాండ్- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. చదవండి: వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు 🚨 BROKEN BAT 🚨 Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni — Spark Sport (@sparknzsport) April 5, 2023 Pathum Nissanka's bat 🤯#SparkSport #NZvSL pic.twitter.com/t2cLh9w9Iq — Spark Sport (@sparknzsport) April 5, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
ఈ చెన్నై కొత్త బౌలర్ స్పీడ్‌లో షోయబ్ అక్తర్‌కి బాబు.. 175 కిమీ రాకెట్ వేగంతో..!
ఆడమ్ మిల్నే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన శ్రీలంక యువ పేసర్ మతీష పతిరన గురించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విలక్షణ బౌలింగ్ శైలితో జూనియర్ మలింగగా గుర్తింపు పొందిన పతిరన 2020 అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో 175 కిలోమీటర్ల రాకెట్ వేగంతో బంతిని విసిరి రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరన నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. Matheesha Pathirana replaces Adam Milne. It's all over for Ferguson and Umran Malik. Swiggy shaking right now. pic.twitter.com/NR4ffRhtzT — Heisenberg ☢ (@internetumpire) April 21, 2022 నాటి యువ భారత జట్టు సభ్యుడు, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు వేసిన ఓ బంతి స్పీడోమీటర్ (వేగాన్ని కొలిచే యంత్రం) సామర్థ్యానికి మించిన రికార్డు వేగాన్ని (175 కిమీ) నమోదు చేసింది. అయితే ఆ బంతి వైడ్ కావడంతో వికెట్లు బతికిపోయాయి. పతిరన ఫాస్టెస్ట్ డెలివరికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. Ladies and gentlemen presenting you new recruit for CSK Matheesha Pathirana. Order for Fastest delivery pic.twitter.com/a6sAzutrqa — Sunny Cricket (@sunsunn_y) April 21, 2022 అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరి రికార్డు (161 కిమీ) పాక్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ పేరిట ఉండగా.. తమ కొత్త పేసర్ స్పీడ్‌లో అక్తర్‌కు బాబు అంటూ చెన్నై అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సైతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ రికార్డు వేగంతో బంతులు వేస్తున్నాడు. ఉమ్రాన్ గత కొన్ని మ్యాచ్‌లుగా క్రమంగా 150కు మించిన స్పీడ్‌తో బౌలింగ్ చేస్తూ స్విగ్గి ఇస్తున్న ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డును దాదాపు ప్రతి మ్యాచ్‌లో గెలుచుకుంటున్నాడు. Matheesha Pathirana will be playing for Chennai Super Kings in #IPL2022.pic.twitter.com/DShfhNv6kD — Johns. (@CricCrazyJohns) April 21, 2022 ఇదిలా ఉంటే, చెన్నై జట్టు మతీషతో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. 19 ఏళ్ల మతీష.. 2020, 2022 అండర్ 19 వరల్డ్ కప్‌లలో లంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దిగ్గజ పేసర్ మలింగ్ బౌలింగ్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే మతీష.. శ్రీలంక తరఫున రెండు టీ20లు ఆడాడు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (ఏప్రిల్ 21) ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. Matheesha Pathirana #CSK pic.twitter.com/k7u4tFdi04 — Shanujan (@J_Shanujan) April 21, 2022 చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి జూనియర్ మలింగ.. మిల్నే స్థానంలో ఎంట్రీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి జూనియర్ మలింగ.. మిల్నే స్థానంలో ఎంట్రీ
CSK Sign Matheesha Pathirana: ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను వరుస ఓటములతో పాటు గాయాల సమస్య కూడా వేధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలైన డిఫెండింగ్ ఛాంపియన్.. గాయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. తొలుత 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరంగా కాగా, తాజాగా 1.9 కోట్ల బౌలర్ ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్) కూడా చాహర్ బాటపట్టాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ గాయపడ్డ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో (కేకేఆర్) బౌలింగ్ చేస్తూ గాయపడ్డ మిల్నే స్థానాన్ని శ్రీలంక యువ పేసర్, జూనియర్ మలింగగా పిలువబడే మతీష పతిరనతో భర్తీ చేయాలని డిసైడైంది. ఈ మేరకు మతీషతో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. 19 ఏళ్ల మతీష.. 2020, 2022 అండర్ 19 వరల్డ్ కప్‌లలో లంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దిగ్గజ పేసర్ మలింగ్ బౌలింగ్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే మతీష.. శ్రీలంక తరఫున రెండు టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, సీఎస్కే ఇవాళ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్..!
Adam Milne Ruled Out Of IPL 2022 Says Reports: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో (6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు) సతమతమవుతూ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైన ఆ జట్టును గాయాల బెడద పట్టిపీడిస్తుంది. ఇప్పటికే 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి దూరం కాగా, తాజాగా విదేశీ (న్యూజిలాండ్) పేసర్ ఆడమ్ మిల్నే కూడా చాహర్ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా మిల్నే కూడా సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఈ సీజన్లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మిల్నేను రెండు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. గాయం తీవ్రతపై తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మిల్నే కోలుకోవడానికి మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఏదో మిరకిల్ జరిగితే తప్ప సీఎస్కే లీగ్ దశ దాటి ముందుకెళ్లడం దాదాపుగా అసంభవం. దీంతో ఆడమ్ మిల్నే సీజన్ మొత్తానికే దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మెగా వేలంలో మిల్నేను సీఎస్కే 1.9 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎస్కే ఏప్రిల్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ముంబై పరిస్థితి సీఎస్కేతో పోల్చుకుంటే మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చదవండి: అమితుమీ తేల్చుకోనున్న లక్నో, ఆర్సీబీ.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే...? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చి, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో పిడుగులాంటి వార్త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా లీగ్‌కు దూరం కాగా (ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది), తాజాగా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ టాన్సిల్స్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. గత కొంతకాలంగా టాన్సిల్స్‌తో బాధపడుతన్న జోర్డాన్‌కు ఇన్ఫెక్షన్ అధికం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. మరోవైపు మరో విదేశీ పేసర్ ఆడమ్ మిల్నే పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు గాయం బారిన పడ్డాడు. అతని తగిలిన గాయం కూడా తీవ్రమైందేనని సమాచారం. సీఎస్కే ఆదివారం (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. గాయాలబారిన పడి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటం ఆ జట్టును కలవరపెడుతుంది. ప్రస్తుతం సీఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిలో ఒక్క ప్రిటోరియస్ తప్ప మిగిలిన వారంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్నోతో మ్యాచ్‌లో శివమ్ దూబే వేసిన ఒక్క ఓవర్ సీఎస్కే నుంచి విజయాన్ని లాగేసుకుంది. లక్నోతో మ్యాచ్‌లో సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చదవండి: IPL 2022: 10000 పరుగుల క్లబ్లో చేరనున్న రోహిత్ శర్మ.. -
దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Ind Vs Nz 3rd T20I: Rohit Sharma Salute To Deepak Chahar Six Video Goes Viral: ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బాల్తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడని మరోసారి నిరూపించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ 21 పరుగులు చేసి రోహిత్ సేన భారీ స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఓపెనర్ ఈషన్ కిషన్ ఔటయ్యక, భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో.. తొలి రెండు బంతుల్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు కొట్టగా, నాలుగో బంతిని లాంగ్ ఆన్దిశగా భారీ సిక్స్‌గా మలిచాడు. కాగా షార్ట్ బాల్‌ను దీపక్ చాహర్ సిక్సర్‌గా కొట్టినందుకు డగౌట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సెల్యూట్ చేశాడు. అఖరి ఓవర్లో చాహర్ ఏకంగా 19పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌కు నిర్దేశించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్ చంద్... ఫొటోలు వైరల్ pic.twitter.com/fwckFcqHrZ — Simran (@CowCorner9) November 21, 2021 -
4, 4, 4, 4, 4, 0.. టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి
Mathew Cross Hits 5 Boundaries In Single Over 2nd Time T20 WC History.. మిల్నే వేసిన ఆరో ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్ మాథ్యూ క్రాస్ రెచ్చిపోయాడు. తొలి ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు. దాంతో స్కాట్లాండ్కు ఆ ఓవర్లో 20 పరుగులు లభించాయి. ఇలా టి20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఐదు బౌండరీలు కొట్టడం ఇది రెండోసారి. గతంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ స్కాట్లాండ్ బౌలర్ జాన్ స్టాండర్ (2009లో) బౌలింగ్‌లో ఈ ఘనతను సాధించాడు. చదవండి: T20 WC NZ Vs SCO: ఇండియా మొత్తం నీకు మద్దతుగా ఉంది.. కమాన్ గ్రేవో View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐపీఎల్లో మరో విండీస్ ప్లేయర్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అలరించడానికి మరో వెస్టిండీస్ ఆటగాడు సిద్ధమయ్యాడు. ఇప్పటికే క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రేవో, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సీజన్లో విండీస్‌కే చెందిన పేసర్ అల్జర్రీ జోసెఫ్ ఆడబోతున్నాడు. అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతూ గాయం కారణంగా జట్టుకు దూరమైన న్యూజిలాండ్ క్రికెటర్ ఆడమ్ మిల్నే స్థానంలో అల్జర్రీ జోసెఫ్‌ను తీసుకున్నారు.ఈ మేరకు జోసెఫ్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చకుంది. ఆడమ్ మిల్నే మడమ గాయంతో స్వదేశానికి పయనమైన నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా జోసెఫ్ ఆడటానికి అనుమతి ఇచ్చారు. ఈ సీజన్లో మిల్నే స్థానాన్ని జోసెఫ్ భర్తీ చేస్తాడని ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్ తరఫున తొమ్మిది టెస్టులు, 16 వన్డేలు ఆడిన అనుభవం జోసెఫ్‌ది. కుడిచేత వాటం పేసర్ అయిన జోసెఫ్ 25 టెస్టు వికెట్లు, 24 వన్డే వికెట్లను సాధించాడు. ఇప్పటికే శ్రీలంక పేసర్ లసిత్ మలింగా ముంబై ఇండియన్స్‌తో కలవగా, ఇప్పుడు జోసెఫ్ ఎంపిక ఆ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టమైంది. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. -
ముంబై జట్టులోకి కివీస్ బౌలర్
సాక్షి, ముంబై : గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్ స్థానాన్ని న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే భర్తీ చేయనున్నాడు. దీనిని ఐపీఎల్ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఆటగాడి చేరికపై ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఆడిన ఈ కివీస్ బౌలర్‌పై ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. కానీ ఈ కివీస్ ఆటగాడికి ఈ ఐపీఎల్లో ఆడే అదృష్టం కమిన్స్ రూపంలో వరించింది. ఇప్పటికే మిల్నే ముంబై జట్టుతో చేరి ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏప్రిల్ 17( మంగళవారం)న ముంబై, బెంగళూరుల మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకు మిల్నే కివీస్ తరుపున 40 వన్డేల్లో 41 వికెట్లు, 19 టీ20ల్లో 21 వికెట్లు సాధించాడు. ఇక ఐపీఎల్లో బెంగళూర్ తరుపున 5 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయం పొంది పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. -
మిల్నె అవుట్.. హెన్రీ ఇన్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నె గాయంతో వరల్డ్ కప్ సెమీస్ పోరుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి రానున్నాడు. మిల్నె స్థానంలో హెన్రీని తీసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. వెస్టిండీస్ తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మిల్నె ఇబ్బందిగా కదిలాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎమ్మార్ స్కాన్ తీయగా ఎడమ మడం చుట్టు వాపు ఉన్నట్టు తెలిసింది. దీంతో అతడు తర్వాతి మ్యాచ్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ ను మిల్నె బౌల్డ్ చేశాడు. 23 ఏళ్ల మిల్నె ఇప్పటివరకు 8 వన్డేలు, 2 టి20 మ్యాచ్ లు ఆడాడు. -
బిన్నీని తెస్తేనే నయం!
హామిల్టన్: భారత్ వన్డేలో నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశమే లేదు. ‘నలుగురు పేసర్లతో ఆడితే మాకు రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి కెప్టెన్‌పై నిషేధం, రెండు ఓటమి’ న్యూజిలాండ్‌తో తొలి వన్డే తర్వాత ధోని వ్యాఖ్య ఇది. నలుగురు పేసర్లతో ఆడటంవల్ల స్లో ఓవర్ రేట్ అనేది భారత్‌కు పెద్ద సమస్య. కాబట్టి ఈ ఆప్షన్‌ను ధోని కొట్టిపారేశాడు. కానీ కివీస్‌లో వికెట్ల స్వభావం దృష్ట్యా ఇద్దరు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా)తో ఆడే వ్యూహం బెడిసికొట్టొచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఓ రకంగా జట్టుకు భారంగానే మారాడని అనుకోవాలి. కేవలం బౌలర్‌గా జట్టులో ఉంటే సరే... కానీ ఆల్‌రౌండర్ కోటాలో ఆడుతున్న జడేజా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఆల్‌రౌండర్ ఎక్కడా బంతితోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాట్స్‌మెన్‌గా ఎలాగూ పనికి రావడం లేదు. తొలి వన్డేలో జడేజా కనీసం పది నిమిషాలు క్రీజులో నిలబడి కోహ్లికి సహకరిస్తే ఫలితం మరోలా ఉండేది. రేపు ప్రపంచకప్‌లోనూ ఇవే వికెట్లు కాబట్టి... భారత్ ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవడం మేలు. అదనంగా బ్యాట్స్‌మన్ కావాలంటే రాయుడు ఉన్నాడు. ఆల్‌రౌండరే కావాలంటే పేస్ ఆల్‌రౌండర్‌గా స్టువర్ట్ బిన్నీ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి సిరీస్‌లో వీలైనంత తొందరగా బిన్నీని ఆడించడం మేలు. రేపు (బుధవారం) జరిగే రెండో వన్డేలో ధోని ఈ ప్రయోగం చేస్తాడా..? లేక జడేజాకే కట్టుబడతాడా అనేది ఆసక్తికరం. సిరీస్‌కు మిల్నే దూరం! పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో గాయపడ్డ మిల్నేకు ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.