Ind Vs Nz 3rd T20I: దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Ind Vs Nz 3rd T20I: Rohit Sharma Salute To Deepak Chahar Six Video Goes Viral: ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడని మరోసారి నిరూపించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ 21 పరుగులు చేసి రోహిత్ సేన భారీ స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఓపెనర్ ఈషన్ కిషన్ ఔటయ్యక, భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో.. తొలి రెండు బంతుల్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు కొట్టగా, నాలుగో బంతిని లాంగ్ ఆన్‌దిశగా భారీ సిక్స్‌గా మలిచాడు. కాగా షార్ట్ బాల్‌ను దీపక్ చాహర్ సిక్సర్‌గా కొట్టినందుకు డగౌట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సెల్యూట్ చేశాడు. అఖరి ఓవర్‌లో చాహర్ ఏకంగా 19పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌కు నిర్దేశించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్ చంద్... ఫొటోలు వైరల్
— Simran (@CowCorner9) November 21, 2021