CWC 2023 Semi Finals: ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: రోహిత్‌ శర్మ

CWC 2023: Team India Captain Rohit Sharma Comments Before Semi Finals Against New Zealand - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇవాళ (నవంబర్‌ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌,న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి.

మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్‌కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ..

ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్‌ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. 

ప్రపంచకప్‌లో సెమీస్‌ అయినా లీగ్‌ మ్యాచ్‌ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్‌ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు.

2011లో సగం మంది క్రికెట్‌ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్‌ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. 

చదవండి: భారత్‌తో మ్యాచ్‌ మాకు పెద్ద సవాల్‌.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2023
Nov 15, 2023, 16:12 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడుతున్న యువ ఓపెనర్‌...
15-11-2023
Nov 15, 2023, 15:50 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌-న్యూజిలాండ్‌ తలపడతున్నాయి. ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌...
15-11-2023
Nov 15, 2023, 15:04 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోసారి జట్టుకు...
15-11-2023
Nov 15, 2023, 14:49 IST
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త...
15-11-2023
Nov 15, 2023, 14:09 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య  తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో...
15-11-2023
Nov 15, 2023, 13:30 IST
ICC Cricket World Cup 2023 - India vs New Zealand, 1st Semi-Final (1st v 4th)...
15-11-2023
Nov 15, 2023, 12:30 IST
వర్షం కారణంగా వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా,...
15-11-2023
Nov 15, 2023, 11:46 IST
క్రికెట్‌ ఫీవర్‌ యూనివర్సల్‌ గేమ్‌ ఫుట్‌బాల్‌ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్‌,న్యూజిలాండ్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు దిగ్గజ...
15-11-2023
Nov 15, 2023, 11:14 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) తొలి సెమీఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే....
15-11-2023
Nov 15, 2023, 10:39 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా మాజీ...
15-11-2023
Nov 15, 2023, 09:34 IST
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీస్‌ ఆడిన భారత ఆటగాడిగా...
15-11-2023
Nov 15, 2023, 08:50 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి...
15-11-2023
Nov 15, 2023, 07:31 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్‌, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో...
14-11-2023
Nov 14, 2023, 20:23 IST
రెండు అడుగులు.. రెండే రెండు అడుగులు దాటితే చాలు.. వరల్డ్ కప్ టైటిల్  మరోసారి టీమిండియా సొంతమవుతుంది. పుష్కరకాలం తర్వాత...
14-11-2023
Nov 14, 2023, 13:41 IST
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అతని వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ వయసుపై, ప్రస్తుత...
14-11-2023
Nov 14, 2023, 12:57 IST
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు  ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)...
14-11-2023
Nov 14, 2023, 11:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది....
14-11-2023
Nov 14, 2023, 10:32 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. బుధవారం జరుగబోయే...
14-11-2023
Nov 14, 2023, 08:13 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా,...
14-11-2023
Nov 14, 2023, 07:34 IST
భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ (లీగ్‌) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top