సచిందు కొలంబగె, హ్యారీ బ్రూక్ (PC: Twitter)
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 48.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (67) అర్థసెంచరీతో రాణించగా, విల్ జాక్స్ (46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, జో రూట్ (44) రాణించాడు.
లంక బౌలర్లలో డెబ్యూ ఆటగాడు సచిందు కొలంబగె, అసితా ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టగా, దునిత్ వెల్లలాగె, చమీర, మదుషంక తలా ఒక వికెట్ తీశారు. కాగా అరంగేట్రం మ్యాచ్‌లోనే సచిందు తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. జో రూట్, బట్లర్ (31), జేమీ ఓవర్టన్ (8) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ముఖ్యంగా జో రూట్‌ను అర్థసెంచరీ చేయకుండా అడ్డుపడిన సచిందు ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 2018లో లంక బౌలర్ చేతిలో ఫిఫ్టీ చేయకుండా వెనుదిరిగిన రూట్.. మళ్లీ 8 ఏళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేయకుండా ఔటయ్యాడు. ఈ గ్యాప్‌లో లంకతో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో రూట్ కనీసం అర్థశతకం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.
ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన షఫాలీ వర్మ


