Photo Credit: Twitter
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు (పురుషులు, మహిళలు) వరుస భారీ విజయాలతో దుమ్మురేపుతున్నాయి. జపాన్‌లోని కకమిగహారా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్లు ప్రత్యర్థులపై గోల్స్ వర్షం కురిపిస్తూ టోర్నమెంట్‌లో దూసుకుపోతున్నాయి. పురుషుల విభాగంలో మంగళవారం గ్రూప్-ఏలో భారత్ 16-1 తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మ్యాచ్‌లో జుగ్‌రాజ్ సింగ్ 4 గోల్స్ చేయగా, అభిషేక్, దిల్ప్రీత్ సింగ్ చెరో హ్యాట్రిక్ సాధించారు. అంతకముందు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ 13-1తో ఇండోనేషియాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
ఇక మహిళల విభాగంలో ఇవాళే జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 17-1తో ఇండోనేషియాను మట్టికరిపించింది. దీపికా సెహ్రావత్, రుతుజా పిసల్ హ్యాట్రిక్‌లతో చెలరేగారు. అంతకముందు ఉజ్బెకిస్తాన్‌పై అమ్మాయిల జట్టు 19-0 తేడాతో ఇందులో దీపికా ఒక్కరే ఏకంగా 8 గోల్స్ చేయడం విశేషం. ఇక భారత పురుషుల జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 24న బలమైన సౌత్ కొరియాతో తలపడనుంది.
ఇక మంగళవారం భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. క్రికెట్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది. హర్మన్‌ప్రీత్ సేనకు ఆసియా క్రీడల్లో ఇది వరుసగా రెండో స్వర్ణం కావడం విశేషం. దీంతో భారత్ తమ పతకాలు సంఖ్యను ఏడుకు పెంచుకుంది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి.
మిగిలిన క్రీడల విభాగానికొస్తే బ్యాడ్మింటన్, వుశు క్రీడల్లో భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. కబడ్డీ పురుషుల జట్టు 63-31తో సౌత్ కొరియాను చిత్తు చేసింది. ఇక షూటింగ్‌లో తొలిరోజు రెండు రజతాలు రాగా, సోమవారం రెండు రజతాలు, ఒక కాంస్యం వచ్చి చేరాయి.
ఇదీ చదవండి: జపాన్‌పై విజయం.. తక్కువ మార్జిన్‌తో భారత్ గట్టెక్కిన సందర్భాలు!


