PC: BCCI/X
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జపాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి భారత్ తిరిగి తమ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
రేటింగ్ పాయింట్ల (269) పరంగా భారత్, ఇంగ్లండ్ సమానంగా ఉన్నప్పటికీ.. మొత్తం పాయింట్లలో 'మెన్ ఇన్ బ్లూ' (17,480) ముందంజలో ఉండటంతో ఫస్ట్ ర్యాంక్ దక్కింది. మొన్నటివరకు టీమిండియానే నంబర్ వన్ ర్యాంక్‌లో ఉండేది.
కానీ శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో విజయం సాధించడంతో భారత్‌ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ నంబర్ వన్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు 72 గంటలు కూడా తిరక్కుండానే భారత్ తిరిగి తన అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
భారత్ సంచలన విజయం
ఇక జపాన్‌తో చారిత్రత్మక మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (0) గోల్డెన్ డకౌట్‌గా కాగా.. ఇషాన్ కిషన్ (3), సంజూ శాంసన్ (9)లు కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రేయస్ అయ్యర్(16) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో జపాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసి ఓటమిపాలైంది.


